- 45 ఏళ్లుగా ఏ తప్పూ చేయలేదు… చేయబోనన్న తెదేపా అధినేత
- పవన్ కల్యాణ్, ఇతర జనసేన నాయకులు, శ్రేణులకు కృతజ్ఞతలు
- ఇన్నాళ్లుగా పోరాటం చేసిన తెదేపా నేతలు, కార్యకర్తలకు అభినందనలు
- సంఫీుభావం తెలిపిన ఇతర పార్టీ నాయకులకు ధన్యవాదాలు
- ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మీడియాకు కూడా కృతజ్ఞతలు
రాజ మహేంద్రవరం : తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల జయజయ ధ్వానాలు, కోలాహలం నడుమ రాజ మహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తెదేపా అధి నేత, మాజీ ముఖ్యంత్రి చంద్రబాబునాయుడు 52 రోజు లు సుదీర్ఘ కాల నిర్బంధం అనంతరం నిన్న సాయం త్రం 4 గంటల 15 నిమిషాలకు బయటకు వచ్చారు. ప్రజల మధ్యకు వస్తూనే జైలువద్ద గుమికూడిన అశేష ప్రజానీకానికి చేతులు జోడిరచి చిరునవ్వుతో అభివాదం చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి కే.ఎస్.జవ హర్,పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, అగ్రనాయకు లు చంద్రబాబుతో ఆత్మీయ కరచాలనం చేశారు.
చంద్రబాబు విడుదలకు ముందు నారా లోకేశ్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఆయనతో ములాఖత్ అయ్యారు. 52 రోజుల తర్వాత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్ర బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ మన:పూర్వకమైన నమస్కారాలు తెలియ చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సంఫీుభావం తెలుపుతూ పూజలు, ప్రార్థనలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారు చూపిన అభిమానం జీవితంలో మరువలేనిదని చంద్రబాబు హృదయాంతరాల నుంచి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, పక్క రాష్ట్రాలు.. పలు దేశాల్లో పెల్లుబికిన అభిమానం, అండ చిరస్మరణీయమన్నారు.
తాను చేపట్టి అమలు చేసిన విధానాలు.. పథకాల తో లబ్ధి పొందిన వారంతా సంఫీుభావం తెలపడం అద్వితీయమైనదని, అట్టి గౌరవం అరుదైనదని, దాంతో తన జీవితం ధన్యమైనదని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. తాను జైలులో ఉన్నన్ని రోజులూ తన 45 సంవ త్సరాల ప్రజాజీవితంలో చేసిన మంచిపనుల్ని ప్రజలు నెమరు వేసుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిం చిందని చంద్రబాబు ఉద్వేగభరితంగా చెప్పారు.
ఈ సందర్భంగా తనది ఒకటే హామీ అని.. గత 45 ఏళ్లుగా తాను ఏ తప్పూ చేయలేదని, చేయనివ్వలేదని, అదే నిబద్ధతతో కొనసాగుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలుగుజాతి ప్రయోజనాల కోసం, యువత భవిత కోసం ఆనాడు హైదరాబాద్‌లో తాను వేసిన ఐటీ పునాదులు, వాటి ఫలితాలను గుర్తించిన ఐటీ ప్రొఫెష నల్స్, ఇతరులు సైబర్ టవర్స్ రజతోత్సవాన్ని జరుపు కోవడం ఎంతో సంతోషకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాను జైల్లో ఉన్నన్నాళ్లు, తనకు మద్దతుగా పలు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం నుంచీ కుప్పం వరకు తనకు మద్ధతుగా జరిగిన సైకిల్ యాత్రను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపిన చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు, శ్రేణులను కూడా అభినందించారు. తనకు సంఫీుభావం తెలిపిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు కూడా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు విరుద్ధంగా గళమెత్తుతున్న మీడియాకు కూడా తెదేపా అధినేత కృతజ్ఞతలు తెలిపారు.