విజయవాడ: జైలులో తనకు ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తన భద్రతపై అనుమానాలు వ్యక్తాం చేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానా లు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. తనను అంతమొందించేందుకు వామషక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అందులో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిం దని… దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.
నన్ను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసింది.
నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజీని పోలీసు లే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో పుటేజీని రిలీజ్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచార మయ్యాయి. భద్రతపై నా భయాలను గాలికొది లేశారు.నా ప్రాణాలకు హాని ఉందని ఎస్పీకి అజ్ఞాత లేఖ వచ్చింది. వామపక్ష తీవ్రవాదులు నా హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు లేఖలో ఉంది. నన్ను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలి సింది. అజ్ఞాత లేఖపై పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదు. అనుకోని ఘటనల నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
పెన్ కెమెరాతో డ్రగ్స్ కేసు నిందితుడు…
జైల్లో డ్రగ్స్ కేసు నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతున్నాడు. ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడు. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారు. జైలులో నా కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్ వాడారు. ములాఖత్‌లో కుటుంబసభ్యులు నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్ ఎగురవేశారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమా దం పొంచి ఉంది. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైకాపా వారేనని అనుమానం.
ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డ్రోన్ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదు. ఇది జైలు అధికారుల నిస్సహాయతకు నిదర్శనం. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారు. గార్డెనింగ్ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారు. రాజ మహేంద్రవరం జైల్లో మొత్తం 2,200 మంది ఖైదీ లు ఉన్నారు. వారిలో 750 మంది డ్రగ్స్ కేసు నిందితులు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. జడ్ ప్లస్ కేట గిరీ రక్షణలో ఉన్న నా భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని లేఖలో చంద్ర బాబు పేర్కొన్నారు. తన భద్రతకు తగిన ఏర్పాట్లు కల్పించాలని కోరారు.