- 79 రోజుల తర్వాత లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం
- హృదయం గర్వంతో ఉప్పొంగుతోందన్న భువనేశ్వరి
అమరావతి: చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చాక టీడీపీ కార్యక్రమాలకు మళ్లీ ఊపొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 79 రోజుల విరామం తర్వాత యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. దీని పై నారా భువనేశ్వరి భావోద్వేగ భరితంగా స్పందించారు. ‘‘మై డియర్ సన్’’ అంటూ తన కుమారుడు లోకేష్‌పై వాత్సల్యం కురి పించారు. ఇవాళ నువ్వు యువగళం పాద యాత్రకు బయల్దేరుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీపై చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు, మద్దతు చూసి నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. సానుకూల మార్పు కోసం సాగుతున్న నీ ప్రస్థానం ఒక ఆశాదీపం. ధైర్యంగా ముందుకు సాగు. ప్రజల ఆకాంక్షలే నీకు మార్గదర్శనం చేస్తాయి… నిన్ను నడిపిస్తాయి అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.