- అంగన్వాడీలకు సంఫీుభావం ప్రకటించిన యువనేత
అమరావతి: జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెది రించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డా రు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియు తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో లోకేష్ పేర్కొన్నారు. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేం దుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు.
ఒకవేళ అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించినా ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మరో 3 నెలల్లో టీడీపీ-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా వారిని తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీల పోరాటానికి సంఫీుభావం తెలియజేశారు.