• కోవూరు నియోజకవర్గం నాగామాంబపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీకి చెందిన చెత్త, వ్యర్థపదార్థాలను మా గ్రామ సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు.
• డంపింగ్ యార్డ్ కు ఎలాంటి నిర్వహణ లేకపోవడంతో చెత్త రోడ్డుమీదకు వచ్చి, ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
• గ్రామంలోని డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక డంపింగ్ యార్డు నిర్వహణ చేపట్టాలి.
• యార్డు చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రయాణీకులకు, స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, గ్రామాలను మురికికూపాలుగా మార్చారు.
• చెత్తపై పన్నులు వేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు.
• టీడీపీ పాలనలో చెత్తనుండి సంపద తయారీ కేంద్రాలు పెట్టి పంచాయితీలకు ఆర్థికవనరుగా తీర్చిదిద్దాం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డుకు ప్రహరీగోడ నిర్మిస్తాం.
• చెత్త డంపింగ్ యార్డువల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.