- భువనమ్మ వచ్చింది.. భరోసా ఇచ్చింది పేరుతో పాట
- పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన టీడీపీ నేతలు
అమరావతి, చైతన్యరథం: టీడీపీ జాతీయ అధ్యక్షు లు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమంపై పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యం లో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ కార్యకర్తలు మనస్తాపానికి గురై 206మంది మృతి చెందారు. వారి కుటుంబాలను నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’పేరుతో పరామర్శించి, వారిని ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై రూపొందించిన పాటను పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఏ.షరీఫ్,టీడీ జనార్థన్,ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బీ.టీ.నాయుడు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దార పనేని నరేంద్ర, నీలాయపాలెం విజయ్‌కుమార్, మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాదెండ్ల బ్రహ్మంచౌదరి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 206 మంది కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండె పోటుతో మృతిచెందారు.
ఇప్పటివరకు నారా భువనేశ్వరి 33 రోజుల్లో, 10 విడతలుగా, 20 పార్లమెంటు నియోజకవర్గాలు, 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 6,092 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంచేసి 149 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించివారిలో మనోధైర్యాన్ని నింపారు. చదువుకుంటున్న కార్యకర్తల కుటుంబాల్లో కొంత మందిని ఎన్టీఆర్ ట్రస్టులో చదివిం చేందుకు పూర్తి బాధ్యతలను భువనేశ్వరి చేపట్టారు. మీకు కష్టం వస్తే పార్టీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే నమ్మకాన్ని కార్యకర్తల కుటుంబాల్లో నింపారు. మిగిలిన కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించి మీకు నేనున్నానంటూ ముందుకు కదు లుతున్నారు అని అన్నారు. కార్యక్రమంలో పరుచూరి కృష్ణ, వల్లూరి కిరణ్, ఎస్.పి.సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.