వలంటీర్లను అభినందించిన నారా భువనేశ్వరి
స్వయంగా భోజనం వడ్డించి వలంటీర్లకు అభినందన
కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు అండగా నిలిచిన వలంటీర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చినా రుణం తీరదు అని నారా భువనేశ్వరి అన్నారు. యువగళం క్యాంప్ సైట్ లో వలంటీర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. వలంటీర్లకు, యువగళం టీమ్ కు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్బంగా వలంటీర్లతో మాట్లాడుతూ.. ఒక్క రోజు నడవడమే మాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ వలంటీర్లు 100రోజులుగా లోకేష్ వెంటే నడవడం అభినందనీయం. విజన్ ఉన్న నాయకుడు లోకేష్. ఇలాంటి వ్యక్తికి మీలాంటి గొప్ప టీమ్ లోకేష్ కు దొరకడం అదృష్టం. మీసేవలు ఇలాగే కొనసాగించండి. మీతో మేముంటాం అని వలంటీర్లతో భువనేశ్వరి అన్నారు. వలంటీర్ల వసతులపై కోఆర్డినేట్లను ఆరా తీశారు. జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.