టిడిపి అధికారంలోకి రాగానే ఎస్టీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి నిధులు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం పెనుగొండ నియోజకవర్గం మిషన్ తండా లో పాలసముద్రం ఎస్టీ సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో ఎస్టీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పధకాలను జగన్ ప్రభుత్వం రద్దుచేసి ఎస్టీలకు తీరని అన్యాయం చేసిందని లోకేష్ విమర్శించారు. ఎస్టీల సంక్సెమానికి మాత్రమే ఖర్చు చేయాల్సిన రూ. 5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం ఇతర పధకాలకు దారిమళ్లించిందన్నారు. మారుమూల గిరిజన తండాలకు బస్, రహదారి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి పాటుపడే చంద్రన్నాను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.