చేనేత కార్మికునికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
గుర్తింపు కార్డులతో సంక్షేమ పధకాలు అందజేత
ఆప్కో బకాయిలు తీర్చి బలోపేతం చేస్తాం
పెన్షన్ పధకం పునరుద్ధరణ
ఈ ఎస్ ఐ సేవల కోసం కేంద్రంతో సంప్రదింపులు
చేనేత కార్మికులతో నారా లోకేష్ ముఖాముఖి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత వ్యవస్థను నేను దత్తత తీసుకుంటాను.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కు జీఎస్టీ లేకుండా రద్దు చేస్తా.
మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం.
ప్రతి చేనేత కార్మికుడికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేనేత గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టు రైతులకు ప్రభుత్వం పడ్డ బకాయిలు అన్ని చెల్లిస్తాం.
చేనేత, పవర్ లూమ్ వస్త్రాలకు తేడా తెలిసేలా ప్రత్యేక లేబిలింగ్ వ్యవస్థ ను తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం
రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలనలో చేనేత కార్మికులు నరకం అనుభవిస్తున్నారు.
టిడిపి హయాంలో మాకు ఆదరణ పథకంలో పనిముట్లు అందజేశారు. వైసిపి పాలనలో మాకు ఎటువంటి సహకారం ఇవ్వడం లేదు.
టిడిపి హయాంలో టెక్స్ టైల్స్ పార్క్ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. వైసిపి ప్రభుత్వం ఆ కంపెనీ రాకుండా ఆపేసింది. టిడిపి అధికారంలోకి వస్తే టెక్స్ టైల్స్ కంపెనీ ఏర్పాటు చెయ్యాలి.
ఎమ్మిగనూరులో చేనేత క్లస్టర్ ఏర్పాటు చెయ్యాలి.
చేనేతకు 5 శాతం జీఎస్టీ విధించడం వలన పెను భారం పడుతుంది.
ఎమ్మిగనూరులో చేనేత కార్మికుల కోసం సొమప్ప కేటాయించిన 24 ఎకరాల భూమిని వైసిపి ఎమ్మెల్యే కబ్జా చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ భూమిని చేనేత కార్మికులకు కేటాయించాలి.
వర్షా కాలంలో పనులు లేక అనేక ఇబ్బందులు పెడుతున్నాం.
చేనేత కార్మికులుగా గుర్తింపు కార్డులు వైసిపి ప్రభుత్వం అందించడం లేదు.
టిడిపి హయాంలో 2 వేలు ఉన్న పట్టు వైసిపి పాలనలో 6 వేలకు చేరింది. అన్ని ముడి సరుకుల రేట్లు పెరిగిపోయాయి.
పవర్ లూమ్, చేనేత కు తేడా తెలిసేలా ప్రత్యేకంగా లేబిలింగ్ చెయ్యాలి.
చేనేత కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
లోకేష్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు లో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎమ్మిగనూరులో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. ఆత్మహత్య చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడి కుటుంబాన్ని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.
ఆప్కోను జగన్ ప్రభుత్వం బ్రష్టు పట్టించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్కో బకాయిలు తీర్చి బలోపేతం చేస్తాం. చేనేతకు పుట్టినిల్లు ఎమ్మిగనూరు.
ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి సోమప్ప గారు.
ప్రభుత్వ సహకారం లేక చేనేత ను వదులుకొని ఎంతో మంది ఇతర పనులు
చేసుకొని జీవిస్తున్నారు.
టిడిపి హయాంలో చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్నాం.
యార్న్, కలర్, కెమికల్స్ అన్ని సబ్సిడీలో అందించాం.రూ.111 కోట్లు చేనేత రుణాలు మాఫీ చేసాం.
ఆదరణ పథకంలో మగ్గం తో సహా ఇతర పనిముట్లు అందజేసాం.
వర్షాకాలం లో చేనేత కార్మికులకు 8వేల రూపాయిల భృతి ఇచ్చి ఆదుకున్నాం.
ఒక్కో కార్మికుడికి టిడిపి హయాంలో ఏడాదికి రూ.50 వేలు సాయం అందేది.
ఇప్పుడు సొంత మగ్గం ఉన్న వారికే నేతన్న నేస్తం అంటూ కేవలం 10 శాతం మందికి మాత్రమే రూ.24 వేలు ఇచ్చి జగన్ చేతులు దులుపుకున్నారు.
టిడిపి హయాంలో సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు ఇచ్చాం.
జగన్ చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క చేనేత కార్మికుడి కుటుంబాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఆదుకోలేదు.
టిడిపి హయాంలో చేనేత కార్మికులకు అమలు చేసిన పెన్షన్ కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పథకాన్నిమళ్ళీ అమలు చేస్తాం.
ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
చేనేత వ్యవస్థలో పనిచేసే అన్ని రకాల కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.
ఈఎస్ఐ వైద్య సేవలు అందించేలా కేంద్రంతో సంప్రదింపులు చేస్తాం.
చేనేతలను ఆర్దికంగానూ, రాజకీయంగానూ ఆదుకొనే బాధ్యత నాది.
చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కుటుంబాలను ఆదుకుంది టిడిపియే నని లోకేష్ వివరించారు.