టిడిపి అధికారంలోకి రాగానే నరేష్ గౌడ్ కు పెన్షన్ అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు 17వవార్డులోని శివాలయం వీధి నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఓ దివ్యాంగుడి ఇంటిలోకి వెళ్లిన యువనేత లోకేష్ అతని కష్టాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగుడు నరేష్ గౌడ్ తల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 35సంవత్సరాలుగా వచ్చే పెన్షన్ ను వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే నిష్కారణంగా తొలగించారు. ప్రభుత్వాసుపత్రి రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న మరో కుమారుడి ఉద్యోగాన్ని కూడా అన్యాయంగా తీసేశారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి అని విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక 6లక్షల పెన్షన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. టిడిపి అధికారంలోకి ఉన్నపుడు దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం. మరో ఏడాది ఓపిక పట్టండి. చంద్రన్న ప్రభుత్వం మీ అందరికీ అండగా నిలుస్తుంది అని వారికి హామీ ఇచ్చారు.