జగన్ ఒక పక్క కర్నూలు న్యాయ రాజధాని అంటాడు. బుగ్గన బెంగుళూరు వెళ్లి విశాఖలో న్యాయరాజధాని అంటాడు. సుప్రీం కోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ వేసాడు. 2024లో టీడీపీకి 14
మంది ఎమ్మెల్యేలు. ఇద్దరు ఎంపీలను ఇవ్వండి. ఉమ్మడి కర్నూలు జిల్లాను పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు తెచ్చి దేశంలోనే అభివృద్ధిలో నంబర్ – 1 జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతాం అని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నాయకుల భూఅక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తాం. భూములు అన్ని వెనక్కి తీసుకోని ప్రజలకు పంచుతాం. టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన వారిని వదలం. అట్టు పెట్టిన వారికి అట్టున్నర పెడతాం అని లోకేష్ హెచ్చరించారు.