సంతనూతలపాడు బైక్ మెకానిక్స్ తో నారా లోకేష్ మాట్లాడుతూ పాదయాత్ర లో బైక్ మెకానిక్స్ ఎంతో మంది నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు.
బైక్ మెకానిక్స్ కూడా జగన్ బాధితులే.
మీ సమస్యలు తెలుసుకోవడానికి సమావేశం పెట్టుకున్నాను.
జగన్ అసమర్థ పాలన, కోవిడ్ దెబ్బ కి ఆదాయాలు తగ్గి టూ వీలర్ అమ్మకాలు తగ్గాయి.
దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపి లో ఉన్నాయి.
కరోనా కంటే ముందు జగరోనా వైరస్ వచ్చింది.
మరో 9 నెలల్లో జగరోనా వైరస్ కి వ్యాక్సిన్ వస్తుంది.
నేను బైక్ మెకానిక్స్ తో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నా అని తెలిసి బైక్ మెకానిక్స్ ని కూడా షాపులు మూసేయాలని బెదిరించారు వైసిపి నాయకులు.
బైక్ నడపడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు బైక్ రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరకి రిపేర్ కి తీసుకువెళ్ళాను.
అనేక కొత్త టెక్నాలజీ లు వస్తున్నాయి. బీస్ 5, బిఎస్ 6, ఎలెక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఉచితంగా ప్రభుత్వాలు అందించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అధునాతన పనిముట్లు అందిస్తాం. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ని గుర్తిస్తాం. బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డు లు అందజేస్తాం. వైద్య సాయం, చంద్రన్న భీమా బైక్ మెకానిక్స్ కి అమలు చేస్తాం.
నేను చిన్నప్పుడు కార్ కూడా తయారు చేసాను. నాకు ఒక మెకానిక్ ఫ్రండ్ ఉంటే అతని దగ్గర బైక్ ఇంజిన్ తీసుకొని ఇద్దరు ప్రయాణం చేసేలా కారు తయారు చేసాను. అది ఇప్పటికి నా దగ్గర ఉంది.
చిన్నప్పుడు చెయ్యాల్సిన సరదా పనులు అన్ని చేశాను. కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాకి వెళ్లి ఇంట్లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అమ్మ కొట్టిన సందర్బాలు కూడా ఉన్నాయి.
కొన్ని లక్షల మంది ఆధారపడిన బైక్ మెకానిక్ రంగాన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం.
పేదరికం లేని రాష్ట్రం టిడిపి లక్ష్యం.
స్వయం ఉపాధి కి పెద్ద పీట వేస్తాం.
ఏ ఊరు వెళ్ళినా ముందు కనపడేది మెకానిక్ షెడ్లే.
మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి నైపుణ్య శిక్షణ ఇస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం.
బైక్ మెకానిక్స్ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశం పై పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.