బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. బద్వేల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని మీరు వైసిపి ని భారీ మెజారిటీ తో గెలిపించారు. బద్వేల్ లో జరిగింది ఏంటి? అభివృద్ధి నిల్లు… భూకబ్జాలు ఫుల్లు. బద్వేల్ ఎమ్మెల్యే గారి స్థలాన్నే వైసిపి నాయకులు కబ్జా చేసారు అంటే ఉమ్మడి కడప జిల్లా లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకే బద్వేల్ వైసిపి నాయకుల కి ముద్దుగా కాలకేయులు అని పేరు పెట్టా. రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేసారు వైసిపి భూ బకాసురులు.
ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బద్వేల్ ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేసారు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, వైసిపి నేతలు రమణా రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గురు మోహన్, శ్రీ రాములు, పోల్ రెడ్డి, ఎల్లారెడ్డిలు కలిసి రెండు వందల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కొట్టేసారు. ఆర్డీవో వెంకటరమణ 40 మంది వైసిపి కాలకేయుల లిస్ట్ బయటపెట్టారు. వైసిపి నాయకుల్ని తప్పించి అనామకులపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు.
వైసిపి నేతలు యోగానంద రెడ్డి, వెంకట రెడ్డి, పిచ్చి రెడ్డి పోరుమామిళ్ల-బద్వేల్ రోడ్డు పక్కనే ఉన్న రూ.150 కోట్ల విలువైన 200 ఎకరాలు ఆక్రమించారు. పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేసాడు. యూట్యూబ్ లో నీతివంతుడిలా బిల్డప్ బాబాయ్ ప్రతాప్ రెడ్డి అనుచరులు సర్వే నెంబర్ 1289లో 11ఎకరాలు, సర్వే నెంబర్ 1094,1076/1ఎ భూములను బినామీ పేర్లతో కాజేసారు. రంగసముధ్రం చెరువు సమీపంలో సర్వే నెంబర్ 916-లో 23.80 ఎకరాలు ప్రతాప్ రెడ్డి ఆక్రమించారు.
రంగ సముద్రం రెవిన్యూ పొలం లో సర్వే నెంబర్ 1076/1ఏ 10.65 ఎకరాల మాదిగ ఈనామ్ భూముల ఆక్రమణ, సర్వే నెంబర్ 1095లో 20.30 ఎకరాలు, 1095/3 లో మూడు ఎకరాలు నకిలీ పత్రాలతో ఆక్రమణ, సర్వే నెంబర్ 1096లో 2.36ఎకరాల రహదారి అక్రమణ, సర్వే నెంబర్ 1108లో1.47 ఎకరాలు ఆక్రమించారు. కలసపాడు వైసిపి నేత గురివి రెడ్డి ఆసుపత్రి భూమినే లేపేసాడు. మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేర్లతో కొట్టేసాడు. వైసిపి నేత పురుషోత్తం రెడ్డి కలసపాడు, పాత రామాపురం, శంఖవరం, మామిళ్లపల్లి భూములతో పాటు అటవీ భూమి కూడా కలిపి 120 ఎకరాలు కబ్జా చేసాడు. బద్వేల్ మున్సిపాలిటీ లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా ఛైర్మెన్ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టర్లు 23 శాతం కప్పం కట్టాల్సిందే. అందుకే కాంట్రాక్టర్లు పనులు చెయ్యమంటూ చేతులు ఎత్తేసారు.