యువగలమ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం డోన్ నియోజకవర్గం హనుమంతురాయనిపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు చూస్తున్నాం. కరువు మండలాలకు పరిహారం అందడం లేదు. గతంలో పంటబీమా, ఇన్ పుట్ సబ్సీడీ, కరువు చెక్కులు వచ్చేవి.
గ్రామంలో ఉన్న నీటి సమస్య దృష్ట్యా చెరువు ఏర్పాటు చేయాలి. మా సమస్యలను పరిష్కరించి, గ్రామ రూపురేఖలు మార్చాలి అని కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. కరువు పరిస్థితులు అంచనా వేసి గతంలో మండలాల వారీగా అదనంగా పనిదినాలు కల్పించాం. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే రైతులకు బీమా సొమ్ము అందించారు. ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి పట్టడం లేదు. హనుమంతురాయునిపల్లిలో ఎన్ఆర్జీసీ నిధులతో చెరువు ఏర్పాటుకు ప్రయత్నిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.