టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటుచేసి హఫీజ్ ఖాన్ ఆక్రమించిన భూములను సొంతదారులకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు కాళికామాత గుడి వద్ద నగర ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కర్నూలు నగరంలో ఇదివరకెన్నడూ లేని విధంగా పన్నులు పెంచారు. దీంతో కర్నూలులో సామాన్యుడు బతకాలంటే కష్టతరంగా మారింది.
పట్టణంలో ఇంటిపన్నులు 15 శాతం పెంచారు. ట్యాక్సులు పెంచడం తప్ప గత నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. వర్షం వస్తే కర్నూలు నగర వీధులు తటాకాలను తలపిస్తున్నాయి. డ్రైన్లలో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. కర్నూలు నగరప్రజల సంక్షేమాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గాలికొదిలేశారు. మీరు వస్తున్నారని తెలిసి హడావిడిగా రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక కర్నూలులో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు కబ్జాలపై ఉన్న శ్రద్ధ నగరాభివృద్ధిపై లేదు. లోకేష్ వచ్చే వరకూ ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయని ఆయనకు తెలియకపోవడం విచారకరం. భూముల కబ్జా చేసే పనిలో బిజీగా ఉండి ఎమ్మెల్యే గారు ప్రజల్ని గాలికొదిలేశారు.
కర్నూలు నగరం బుధవారపేట లోని సర్వే నంబర్ 209/1 పరిధిలో 1.50 ఎకరాల సుల్తానియా మసీద్ వక్ఫ్ భూమిని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కబ్జా చేసారు. దిన్నెదేవరపాడు గ్రామంలో సర్వే నెంబర్.19 లో దాదాపు 600 కోట్ల విలువ గల కొట్టాల మసీదు ఆస్థి (వక్ఫ్ బోర్డు) 59.19 ఎకరాలు వెంచర్లు వేసి అమ్ముకున్నారు. ఓల్డ్ బస్టాండ్ సమీపంలో అజంతా హోటల్ వద్ద ఉన్న భూమిని యజమానులను బెదిరించి ఎమ్మెల్యే కొట్టేశారు.
సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్.62 సుమారు 10 కోట్లు విలువ గల 5.36 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారు. పందిపాడులోని సర్వ్ నెంబర్: 7ఎ/22-12 ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ 12 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు అని ఆరోపించారు.