టిడిపి అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద కమలాపురం నియోజకవర్గ నిరుద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ తెచ్చి ఉద్యోగాలిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రెండుసార్లు శంకుస్థాపన చేసేరే తప్ప, నేటికీ అక్కడ పనులు ప్రారంభించలేదు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ మాటతప్పిమడమ తిప్పారు టీడీపీ అధికారంలోకి వచ్చాక కడపజిల్లా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. టీడీపీ పాలనలో గ్రూపు ఉద్యోగాలు, ఇంజినీర్ ఉద్యోగాలు పెద్దఎత్తున భర్తీ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి యువతను ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
అబద్దాలు, మోసం, వంచనకు ప్రతిరూపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పి నిరుద్యోగులను నిండాముంచారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోయిన 470మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ,నిస్పృహకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు టిడిపి హయాంలో భూసేకరణ చేసి శంకుస్థాపనచేస్తే, మళ్లీమళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈయన చేసిందేమీ లేదు.
అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రభుత్వోద్యోగాలు భర్తీచేస్తాం. ప్రైవేటురంగంలో 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం. చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.3వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.