టిడిపి అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలు అన్నింటిపైనా ‘సిట్’ వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాలు మారినా వచ్చిన పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బలమైన చట్టం తీసుకు వస్తామని చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ధర్మవరం నియోజకవర్గం కృష్ణంరెడ్డిపల్లి లో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు లేవనెత్తిన సమస్యలపై లోకేష్ స్పందించారు. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1. ఇక ఇంటి పన్ను పెంచారు. చెత్త పై పన్నేసారు. జగన్ బాదుడు కి ప్రజలు బ్రతకలేని పరిస్థితి వచ్చిందిన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులను ప్రక్షాళన చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెండు బటన్ల సిఎం అని విమర్శించారు. బల్ల పైన బటన్ నొక్కితే పది రూపాయిలు మీ అకౌంట్ లో పడతాయి. బల్ల కింద ఉన్న బటన్ నొక్కితే 100 రూపాయలు మీ అకౌంట్ నుండి పోతాయని చెప్పారు. మహిళలు మాట్లాడటం మొదలు పెడితే తాడేపల్లి ప్యాలస్ పిల్లి రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్ముకున్నాను అని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తాం.
77 జిఓ తీసుకొచ్చి పీజీ చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కాలేజీలకు ఫీజులు చెల్లించి అందరికీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. అని వివరించారు. మహిళలకు ఆస్తి లో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్.
మహిళల స్వయం ఉపాధికి డ్వాక్రా ఏర్పాటు చేసింది చంద్రబాబు.
టిడిపి హయాంలో 8,500 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేశామని చెప్పారు. పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా మహిళలకు 10,000 కోట్లు ఇచ్చాం.
2500 కోట్లు అభయహస్తం డబ్బులు కొట్టేసింది జగన్ అని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మహిళలకు కల్పిస్తాం.
మహిళా ఆటో డ్రైవర్ల ను ఆదుకుంటాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. పన్నులు తగ్గిస్తాం. ఫైన్ల వేధింపులు లేకుండా చేస్తామని వెల్లడించారు.
45 ఏళ్లకే పెన్షన్ అని బిసి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని జగన్ మోసం చేశాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తరువాత ఓట్లు అడుగుతా అని ఇప్పుడు విషం కంటే ప్రమాదకరమైన మందు తయారు చేసి అమ్ముతున్నారు.
మద్యం అమ్మకాలను ఆదాయంగా చూపించి 25 వేల కోట్ల అప్పు తెచ్చాడు జగన్.
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అని మోసం చేశారు.
దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదు అని లోకేష్ వివరించారు. జగన్ వాలంటీర్ వాసు ని ఇంటికి పంపి చంద్రబాబు సిఎం అయితే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు. పండుగ కానుకలు, పెళ్లి కానుక, చంద్రన్న భీమా, పెన్షన్ 2 వేలకు పెంపు, అన్న క్యాంటీన్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి అని తెలిపారు. జగన్ గెలిచిన తరువాత 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడన్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది టిడిపి అని చెప్పారు. జగన్ కి తెలిసింది జైలు మాత్రమే. అందుకే ఆయన సిఎం అయిన వెంటనే కంపెనీలను బెదిరించి పక్క రాష్ట్రానికి తరిమేశాడు.
అమరరాజా, రిలయన్స్, జాకీ ఇలా అనేక కంపెనీలు జగన్ వేధింపులు తట్టుకోలేక పారిపోయాయి.
6 వేల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమను రాప్తాడు ఎమ్మెల్యే 15 కోట్లు డిమాండ్ చేసి పక్క రాష్ట్రానికి తరిమేశాడు.
ఇప్పుడు ఆ భూమి ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపించారు. కేవలం మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఫాక్స్ కాన్ అనే సంస్థ తీసుకొచ్చి 14 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించాం.
ఇప్పుడు జగన్ చెత్త పాలన కారణంగా ఏపి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు కి జాకీ లాంటి మరో పెద్ద సంస్థ ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబు.ఒక్క జాకీ సంస్థ వెళ్లిపోవడం వలన 6 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కియా కూడా ఫేక్ కంపనీ అని జగన్ అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ మాట అనే దమ్ము జగన్ కి ఉందా?
జాకీ కోసం పోరాడిన వారి పై వైసిపి ప్రభుత్వం పెట్టిన కేసులు మాఫీ చేస్తామని లోకేష్ వెల్లడించారు.
హిజ్రాలకు పెన్షన్ ల పునరుద్ధరణ
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హిజ్రాలకు మళ్లీ పెన్షన్ అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. హిజ్రాలకు టిడిపి హయాంలో ఇచ్చిన పెన్షన్లు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అంటూ లోకేష్ వద్ద హిజ్రాలు. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి ఈ హామీ ఇచ్చారు. హిజ్రాలకి దేశంలోనే మొదటి సారిగా పెన్షన్ ఇచ్చింది టిడిపి ప్రభుత్వం.
హిజ్రాలు సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని పెన్షన్ ఇచ్చాం. జగన్ హిజ్రాలకు ఇచ్చే పెన్షన్ కూడా తీసేశారు అని చెప్పారు.