బద్వేల్ జోష్ అదిరిపోయింది. మట్లి రాజులు ఏలిన నేల బద్వేల్. మహానగరం అయ్యే శక్తి బద్వేలు కి ఉంది అని బ్రహ్మం గారు చెప్పారు. శ్రీ కొండ గోపాల స్వామి దేవాలయం, చెన్నకేశవస్వామి దేవాలయం, కాశిరెడ్డి నాయన ఆలయం ఉన్న నేల బద్వేల్. బద్వేల్ పెద్దాయన బిజి వేముల వీరా రెడ్డి గారు. కడప జిల్లాలో పసుపు జెండా ఎగరేసిన మొనగాడు. ఆయన రికార్డులు కొట్టే వారు ఎవరూ లేరు. ఘన చరిత్ర ఉన్న బద్వేల్ గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం… మనగళం… ప్రజాబలం. వైసిపి నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేసారు. నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్. సవాల్ చెయ్యాలంటే హిస్టరీ ఉండాలి. అడ్డుకోవాలి అంటే దమ్ముండాలి. ఆ రెండూ వైసిపి నాయకులకు లేవు.
క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా? అడ్డొచ్చిన వైసిపి సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోయాం. 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. సీమ గడ్డ పై యువగళం ఒక హిస్టరీ. సీమ పౌరుషం ఏంటో తాడేపల్లి ప్యాలస్ కి చూపించాం. సీమలో నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సీమ జగన్ కి చాలా ఇచ్చింది. జగన్ సీమ కి ఎం ఇచ్చాడు? సీమ జగన్ ని సీఎం చేసింది, సంపద ఇచ్చింది. 49 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. 8 మంది ఎంపీలను ఇచ్చింది. జగన్ సీమ కి ఇచ్చింది ఏంటి? జగన్ సీమ బిడ్డ కాదు సీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. టిడిపి చేసిన అభివృద్ధి లో పది శాతం కూడా జగన్ సీమ లో చెయ్యలేదు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, పేదలకు ఇళ్లు, రోడ్లు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టిడిపి.
జగన్ సీమ ప్రజల్ని చీట్ చేసాడు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఇటుక పెట్టలేదు. బద్వేల్ గడ్డ పై నిలబడి సవాల్ చేస్తున్నా సీమకు నివ్వు చేసింది ఏంటో చెప్పు. నేను చర్చకు సిద్ధం ఎప్పుడు వస్తావో చెప్పు జగన్. 2019 లో జగన్ కి ఇచ్చిన మ్యాండేట్ 2024 లో మాకు ఇవ్వండి. జగన్ కి ఇచ్చిన 49 సీట్లు మాకు ఇవ్వండి. సీమ సత్తా ఏంటో దేశానికి చూపిస్తాం. సీమకు ఎం చేస్తామో మిషన్ రాయలసీమలో చెప్పాము. మిషన్ రాయలసీమ అమలు చేసి సీమ ని నిలబెడతాం. ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇదే బద్వేల్ సెంటర్ లో చొక్కా పట్టుకొని నిలదీయండి. లోకేష్ ది అంబేద్కరిజం… జగన్ ది సైకోయిజం. లోకేష్ ప్రజల్లో ఉంటాడు… జగన్ పరదాల్లో ఉంటాడు. లోకేష్ ది మిషన్ రాయలసీమ.. జగన్ ది కమిషన్ రాయలసీమ అని నారా లోకేష్ అన్నాడు .