కష్టాల్లో ఉన్నవాడు శత్రువైనా ఆపన్నహస్తం అందించాలన్న సాయగుణం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే ఉంది. వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ నుంచి చెన్నై వరకు వెళ్లే తెలుగుగంగ ప్రధాన కాల్వ ఇది. రాష్ట్రంలో ఎడారి ప్రాంతాన్ని తలపించే రాయలసీమకు సాగునీటితోపాటు పొరుగుఉన్న తమిళసోదరులకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ 1983లో తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే… చంద్రబాబు గారు సిఎంగా ఉన్న సమయంలో 1996 సెప్టెంబర్ 23న ఇక్కడ నుంచి తొలిసారిగా నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించాయి. దీనిద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నై ప్రజలకు తాగునీరు అందుతోంది. సొంతలాభం కొంతమానుకు… పొరుగువారికి తోడుపడవోయ్ అన్న సిద్ధాంతం మాదైతే… ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని పొరుగు రాష్ట్రానికి తరిమేసి, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే సిద్ధాంతం జగన్ రెడ్డిది!