సర్వేపల్లి జనసునామీ సూపర్. మా తాత గారు, మా నాన్న గారు అంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. నా పై అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. దేశానికే వెలుగునిచ్చే దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్రాజెక్టు, కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి సొంతం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం. మస్తానయ్య దర్గా, వేళాంగిణి మాత చర్చి ఉన్న పుణ్య భూమి సర్వేపల్లి. ఎంతో ఘన చరిత్ర ఉన్న సర్వేపల్లి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం. యూత్ దెబ్బకి జగన్ కి దిమ్మతిరిగింది. యువగళాన్ని ఎటాక్ చెయ్యమని మంత్రులను, మాజీ మంత్రులను రంగంలోకి దింపాడు. కోర్టు దొంగ యాత్ర ఫ్లాప్ అంటున్నాడు, సిల్లీ బచ్చా జనం లేరు అంటున్నాడు. ఇంత మంది మాట్లాడుతున్నారు అంటే అర్ధం ఏంటి? యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్. జగన్ పోలీసుల్ని పంపాడు మనం ఆగలేదు, వైసిపి సైకోల్ని పంపాడు తగ్గలేదు. సైకోలు కోడిగుడ్డు వేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి పంపారు. భయం మా బయోడేటా లో లేదు బ్రదర్. బాంబులకే భయపడని బ్లడ్ మాది.
రాసిపెట్టుకోండి యువగళంతో వైసిపి కి ఎండ్ కార్డ్ పడబోతోంది. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఆయన బిల్డప్ కి రియాలిటీ కి తేడా మీకు తెలియాలి. రెండు ఉదాహరణలు చెబుతాను. మొదటిది సత్య నాదెళ్ల. జగన్ ఇంటికో సత్య నాదెళ్ల ను తయారు చేస్తానని ప్రకటించాడు. ఇది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? ఊరికో అనంతబాబుని తయారు చేసాడు. బిల్డప్ బాబాయ్ ఒక్క కంపెనీ తీసుకురాలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఇంటికో సత్యనాదెళ్ల అంటున్నాడు. చేసింది ఏంటి? ఊరికో అనంతబాబుని తయారు చేసి ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చాడు. రెండో ఉదాహరణ రూ.3 వేల పెన్షన్. టిడిపి హయాంలో 50 వేల లోపు ఉన్న రైతు రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేసారు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ మొత్తం లక్షా యాభైవేలు ఒకే సారి మాఫీ చెయ్యాలని రచ్చరచ్చ చేసాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 వేల పెన్షన్ ని రూ.3 వేలకు పెంచుతానని జగన్ బిల్డప్ ఇచ్చాడు. రియాలిటీ ఏంటో తెలుసా జగన్ సీఎం అయిన తరువాత రూ.750 రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పట్టింది. లక్షా యాభైవేలు ఒకే సారి ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం బిల్డప్.. రూ.750 రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టడం రియాలిటీ.
చంద్రబాబు గారు అంటే బ్రాండ్…జగన్ అంటే జైలు. చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది. ఫ్యాక్స్ కాన్, హెచ్సిఎల్, టిసిఎల్ చంద్రబాబు గారి బ్రాండ్లు… బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ జగన్ బ్రాండ్లు. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. కేజీ టొమాటో ధర. రూ.124, పచ్చి మిర్చి ధర రూ.100. పేదలు ఎలా బ్రతకాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతక సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. ఇప్పుడు జీపీఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా దళితుల పై దాడి జరిగిందా? జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. సింహపురి లో నేను సింహం లా అడుగుపెట్టాను. నేను పరదాలు కట్టుకొని యాత్ర చెయ్యడం లేదు. యువగళం కి వస్తున్న రెస్పాన్స్ చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నాయి. 2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం. ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం.
తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి 73 పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయి. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు.
సిల్లీ బచ్చా సీటు గల్లంతు అయ్యింది అందుకే ఫ్రస్ట్రేషన్ లో సొంత పార్టీ నాయకుల్ని, ఆఫ్ ది రికార్డ్ జగన్ ని బండ బూతులు తిడుతున్నాడు. పాపం ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ మీద దాడులకు దిగుతున్నాడు. పిల్ల కాలువ తవ్వడం రాని వాడు.. పర్సెంటా, అర పర్సెంటా తొందర ఎందుకన్నా, వెయిటు..వీ విల్ కంప్లీట్ థిస్ ప్రాజక్ట్ బై 2021 డిసెంబర్ అన్నాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీ లో బిజీగా ఉంటాడు. ఈయన వలన జిల్లాలో ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ఇక మరో కీలక శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. పాపం ఆయన కంపెనీలు తేవాలి అని ప్రయత్నం చేసినా జగన్ పరిపాలన చూసి ఎవరూ రాలేదు. తెచ్చిన ఒకే ఒక్క సెంచురీ ప్లే వుడ్ కంపెనీ ని జగన్ ఇతర జిల్లాకి ఎత్తుకుపోయాడు. నెల్లూరు జిల్లా కి ఒక్క పరిశ్రమ రాలేదు. మూడు కీలక శాఖలు నెల్లూరు జిల్లాకి వచ్చింది గుండు సున్నా. సర్వేపల్లి రూపురేఖలు మార్చేస్తాడని రెండు సార్లు మీరు కాకాణి. గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు.
సర్వేపల్లి అభివృద్ధి చెందిందా? ఒక్కరి జీవితంలోనైనా మార్పు వచ్చిందా? సర్వేపల్లిని గాలికొదిలేసి కాకాణి దొంగ సంతకాలు, కల్తీ మద్యం, కోర్టు దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఆయనకు కోర్టు దొంగ అని పేరు పెట్టా. టిడిపి హయాంలో సర్వేపల్లి అభివృద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. కోర్టు దొంగ హయాంలో అక్రమ మైనింగ్, భూదందాలు, కక్షసాధింపులకు అడ్డాగా మారింది. టిడిపి హయంలోనే సర్వేపల్లి అభివృద్ధి జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాడి 2 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసారు. రూర్బన్ ప్రాజెక్టు కింద వెంకటాచలం మండలాన్ని ఎంపిక చేసి రూ. 116 కోట్లతో గ్రామాల్లో మౌలికవసతులు కల్పించాం. రూ.62 కోట్లతో కండలేరు ఎడమకాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేసి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. డేగపూడి – బండేపల్లి లింక్ కెనాల్ ఏర్పాటు కోసం రూ.23 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం. కోర్టు దొంగ కమిషన్ కోసం ఆ పనులు నిలిపేసారు. రూ.200 కోట్లతో నియోజకవర్గంలో కల్వర్టులు, చెక్ డ్యాములు, తూములు నిర్మించి సాగునీరు అందించారు. రూ.200 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు, లింక్ రోడ్లు వేసాం. గ్రామాల్లో 28 వేల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసాం. పొదలకూరు, వెంకటాచలం, కోడూరులో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాం. టిడిపి హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటిన్లను కోర్టు దొంగ మూసేసాడు. రూ.5 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల మెగా వాటర్ ప్లాంట్ ను కోర్టు దొంగ మూసేసాడు.
ముత్తుకూరు మండలం లో మత్స్యకారేతర ప్యాకేజి మంజూరు చేసాం. ఒక్కో కుటుంబానికి రూ.43 వేల రూపాయలు అందించాం. కోర్టు దొంగ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆ ప్యాకేజ్ ని అడ్డుకున్నాడు. నాలుగేళ్ల తరువాత ప్యాకేజ్ లో కోత పెట్టి రూ.25 వేలే ఇస్తాం అంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వావిలేటిపాడు లో 4.70 ఎకరాల భూమిని కబ్జా చేసారు. ఆనాడు సోమిరెడ్డి గారు దళితుల పక్షాన నిలబడి వారి భూములు వెనక్కి ఇప్పించారు. అక్కడే ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల ప్లాట్లను కూడా కోర్టు దొంగ కొట్టేసాడు. ఆ కేసు కోర్టులో ఉంది. 2014 ఎన్నికల్లో కల్తీ మద్యం పంచి అమాయకుల ప్రాణాలు తీసాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కృష్ణస్వామి జైల్లోనే చనిపోయాడు. కోర్టు దొంగ మహా కంత్రీ సోమిరెడ్డి గారికి వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు దొంగ డ్యాకుమెంట్లు తయారు చేయించాడు. ఆ కేసులో శిక్ష తప్పదని ఏకంగా కోర్టులోనే దొంగతనం చేసాడు. 8 కేసుల్లో నిందితుడికి అధికారం ఇస్తే చెలరేగిపోయాడు. కోర్టు దొంగ అక్రమ గ్రావెల్ మైనింగ్ దెబ్బకి కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు, దళితుల భూములు అన్ని సర్వనాశనం అయ్యాయి. కోర్టు దొంగ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి తెలియకుండానే ఆయన పేరు మీద గ్రావెల్ కొట్టేసాడు. ఏకంగా ఎంపీ పైనే కేసు పెట్టేలా చేసాడు ఈ కోర్టు దొంగ. విరువూరు రీచ్ నుండి కర్ణాటక, తమిళనాడు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కోర్టు దొంగ ఏపీ జెన్ కో ప్రాజెక్టులో నుంచి వచ్చే బూడిదను కూడా వదలడం లేదు. బూడిద కూడా అమ్ముకుంటున్నాడు.
కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు కోర్టు దొంగ. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేసాడు. కోర్టు దొంగ ప్రైవేట్ టోల్ గేట్లు తెరిచాడు. పంటపాళెం, కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్లు పెట్టి కంటైనర్లు, లారీలు, ట్యాంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. వెంకటాచలం మండలం కాకుటూరులో హైవేపక్కన ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ బినామీల పేర్లతో రికార్డుల్లోకి ఎక్కించేశారు. చిల్లకూరు మండలంలోనూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. కోర్టు దొంగ భూదందాల కారణంగా ఆయన అనుచరులు ఐదుగురు జైలుకెళ్లగా ఇద్దరు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు పడింది. కనుపూరు కాలువ పరిధిలో చేయని పనులను చేసినట్టుగా చూపి రూ.43 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇలా సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.100 కోట్ల నిధులను పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి స్వాహా చేశారు. వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కోర్టు దొంగ రైతులకు తీరని ద్రోహం చేసాడు. ధాన్యం కొలతల్లో గోల్ మాల్ చేసాడు. పుట్టికి రూ.5 వేలు నష్టపోయారు. సర్వేపల్లి లో ఎవరు లే అవుట్ వెయ్యాలన్నా ఎకరాకు రూ.10 లక్షలు కోర్టు దొంగకి చెల్లించాలి. ఇలా సంపాదించిన డబ్బుతో జగన్ ప్యాలస్ కి ధీటుగా నెల్లూరులో రాయల్ ప్యాలస్ కట్టాడు. కొంతమంది దీనిని కరోనా ప్యాలస్ అని కూడా పిలుస్తున్నారు అంట.
కోర్టు దొంగ నాలుగేళ్ల సంపాదన ఎంతో తెలుసా? రూ.3 వేల కోట్లు. నెల్లూరు జిల్లాలో సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న నాయకుడిగా కోర్టు దొంగ హిస్టరీలో మిగిలిపోతాడు. దళితుడు ఉదయగిరి నారాయణను పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా దహనం చేయించారు. సోమిరెడ్డి గారు జాతీయ ఎస్సి కమిషన్ కి ఫిర్యాదు చేసి పోరాడిన తరువాత ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. ఏపీ జెన్కో ధర్మల్ పవర్ ప్రాజెక్టు కాలుష్య ప్రభావంతో ఇబ్బంది పడుతున్న నేలటూరు, పైనాపురం తరలింపు ఈ రోజుకీ జరగలేదు. టిడిపి హయాంలో నిధులు కేటాయించి, భూసేకరణ కూడా చేసాం, ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. ఆఖరికి మీడియా వాళ్ళని కూడా వదలలేదు కోర్టు దొంగ. గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక మహిళ కోర్టు దొంగని నిలదీసింది. అది కవర్ చేసిన మీడియా ప్రతినిధి శ్రీనివాస్ పై కేసు పెట్టి వేధించాడు. వరి, నిమ్మ, ఆక్వా రైతుల సమస్యలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో రైతుల్ని తీవ్రంగా దెబ్బతీసాడు. విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడి పెరిగి ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన సబ్సిడీలు అందిస్తాం.
పక్క పార్టీ మీటింగ్ జరిగే చోట ఫ్లెక్సీలు పెట్టే చీప్ మెంటాలిటీ ఈ కోర్టు దొంగది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత నీ ఫ్లెక్సీలు అన్ని జైలు ముందే రాసిపెట్టుకో. మూడు వేల కోట్ల రూపాయలు కక్కిస్తా. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పసుపు జెండా ని మోస్తున్న వారిని గుండెల్లో పెట్టుకుంటా. నా పై 20 కేసులు పెట్టా తగ్గలేదు. ఎక్కువ కేసులు ఉన్న కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పై 67 కేసులు ఉన్నాయి. అయినా తగ్గేదేలేదు అంటున్నారు. నమ్ముకున్న సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడదాం.