అమరావతి,చైతన్యరథం: తనపై ఇసుకకు సంబంధించి నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గుంటూరు మాజిస్ట్రేట్ కోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ది.01.09.2023న సాక్షి తెలుగు దినపత్రికలో ప్రచురితమైన నారాసురుడే ఇసుకాసురుడు అనే శీర్షికతో వెలువడిన వార్తలో నారా లోకేష్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోపిన నిరాధారమైన ఆరోపణల కారణంగా తన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లినందున, ప్రజాబాహుల్యములో తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుజేయాలనే దురుద్దేశ్యంతో మంత్రి పెద్దిరెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణలకు మనస్తాపం చెంది వారి సదరు నిరాధార నిందారోపణలకు నష్ట పరిహారం కింద రూ.50 కోట్లు చెల్లించాలని మరియు బహిరంగంగా షరతులు లేని క్షమాపణను సదరు సాక్షి దినపత్రికలో అదే చోటు అదే ప్రాముఖ్యతతో తెలపాలని, అట్లు చేయని యెడల సివిల్ మరియు క్రిమినల్ పరంగా చర్యలు తీసుకుంటామని తన తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు ద్వారా నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపారు. ఆ నోటీసులను చిత్తూరు జిల్లా సోడం మండలం, యెర్రాతివారి పల్లె గ్రామంలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి మరియు సెక్రటేరియట్‌లోని అతని ఛాంబర్‌కు పంపారు. సదరు నోటీసులను స్వీకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాటికి జవాబు ఇవ్వటం గాని, క్షమాణలు చెప్పటం గాని జరగనందున ది.15.12.2023న గుంటూరు మాజిస్ట్రేట్ వారి కోర్టులో నారా లోకేష్ క్రిమనల్ కేసు దాఖలు చేశారు.