టిడిపి అధికారంలోకి వచ్చాక ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతాం, అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం హంద్రీనీవా నుంచి పైపుల వేసుకొని మా గ్రామ ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నాం.
హంద్రీనావా నుంచి కొందరు ఇసుకను అక్రమంగా తవ్వి, తరలించడంతో భూగర్భజలాలు ఇంకిపోయి, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం.
అనుగొండ గ్రామాన్ని ఆనుకొని ఉన్న వాగు పూడిపోయి వర్షాలు పడినపుడు నీరు గ్రామంలోకి వస్తోంది. మా గ్రామం ముంపు బారిన పడకుండా పూడిక తీయించాలి.
ఇసుక అక్రమరవాణాను అరికట్టి మా గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో 61మంది అమాయక ప్రజలు బలయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోంది అని లోకేష్ ఆరోపించారు.