నంద్యాల జిల్లా… శ్రీశైలం నియోజకవర్గం… వెలుగోడు ఫారెస్ట్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.
భవన నిర్మాణ కార్మికుడు అబ్దుల్ మాట్లాడుతూ
చంద్రన్న భీమా ఉండేది. జగన్ వచ్చిన తరువాత భీమా ఎత్తేశారు. మా తమ్ముడు చనిపోతే కుటుంబానికి ఒక్క రూపాయి సాయం అందలేదు.
జగన్ పాలనలో ఇసుక దొరకడం లేదు. మాకు పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం.
పెయింటింగ్, ఇతర పనులు చేసుకునే భవన నిర్మాణ కార్మికులకు సాయం అందడం లేదు.
కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులకి, చిరు వ్యాపారస్తులకు సాయం అందిస్తాం అని చెప్పి జగన్ ప్రభుత్వం మోసం చేసింది.
భవన నిర్మాణ కార్మికులకు పక్కా ఇళ్లు మంజూరు చెయ్యాలి.
నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
వెల్డింగ్ షాపు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అని రేషన్ కార్డు తో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం.
భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీ రుణాలు అందడం లేదు అని తెలిపారు
లోకేష్ మాట్లాడుతూ
జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులు.
కరోనా కంటే జగనొరా వైరస్ ప్రమాదం.
ఎన్నికల ముందు జగన్ టిడిపి నాయకులు ఇసుక దొచేస్తున్నరు అని ప్రచారం చేసాడు.
ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 5 నుండి 7 వేలకు అమ్ముతున్నాడు. ఆ డబ్బు అంతా ఎవడు దొవ్వుతున్నాడు.
రోజుకి ఇసుక ద్వారా జగన్ ఆదాయం రూ.3 కోట్లు.
ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిపోయింది.
చంద్రబాబు గారి పాలనలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగి నిత్యం పనులు ఉండేవి.
జగన్ పాలనలో ఒక్క అభివృద్ది కార్యక్రమం జరగక భవన నిర్మాణ కార్మికులకు పని దొరకని పరిస్థితి.
చంద్రబాబు గారు 1996 లోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేసి. 1 శాతం సెస్ సేకరించి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది టిడిపి.
బోర్డు ద్వారా భీమా, పిల్లల పెళ్లిళ్లలకి కానుక అందించాం.
బోర్డు ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చి, పనిముట్లు అందజేసాం.
చంద్రన్న భీమా ద్వారా ఎవరైనా ప్రమాదం లో చనిపోతే 5 లక్షలు, సహజ మరణం అయితే 2 లక్షలు ఇచ్చాం.
జగన్ పాలనలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు పక్కదారి పట్టించింది. రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టించారు.
మెడికల్ బిల్లులు, పెళ్లి కానుక, భీమా అందడం లేదు.
జగన్ భీమా కి వైఎస్ గారి పేరు పెట్టి పథకాన్ని నిలిపేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక ధర తగ్గిస్తాం. గతం కంటే మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తాం.
ప్రతి సిమెంట్ బస్తా పై జగన్ కి వాటా వెళ్తుంది. అందుకే సిమెంట్ ధర ఇంతగా పెరిగింది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రం గా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
భవన నిర్మాణం లో ఉన్న అన్ని రంగాల వారిని బోర్డు ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకుంటాం. కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేసి పనులు చేసుకోవడానికి అందిస్తాం. తద్వారా మీ పై భారం తగ్గిస్తాం.
కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం అని చెప్పి జగన్ ప్రభుత్వం అనేక పత్రాలు తీసుకొని ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదు.
చిరు వ్యాపారస్తుల పై జగన్ బాదుడే బాదుడు. రీస్టార్ట్ ప్యాకేజ్ అన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకపోగా చెత్త పన్ను, బోర్డు పన్ను అంటూ వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది.
శ్రీశైలం నియోజకవర్గంలో 13 వేల ఇళ్లు టిడిపి ప్రభుత్వం నిర్మించింది. భవన నిర్మాణ కార్మికులకు పక్కా ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది.
టిడిపి హయాంలో టిడ్కో ఇళ్లు కడితే వాటికి మౌలిక వసతులు కల్పించలేని దుస్థితి జగన్ ప్రభుత్వం ది.
30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టాలని టిడిపి ప్రణాళిక సిద్దం చేస్తే జగన్ వచ్చి మొత్తం నాశనం చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన పనులు, ప్రాజెక్టులు అన్ని తిరిగి ప్రారంభిస్తాం.
టిడిపి హయాంలో శ్రీశైలం అభివృద్ది కోసం 1400 కోట్లు ఖర్చు చేసాం.
14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపి ని గెలిపించారు. కర్నూలు పట్ల జగన్ కి ఎంత ప్రేమ ఉండాలి? టిడిపి హయాంలో చేసిన దాంట్లో కనీసం 10 శాతం అభివృద్ది కూడా జరగలేదు.
వెల్డింగ్ షాపు కి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అని రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు రద్దు చెయ్యడం జగన్ ప్రభుత్వం దుర్మార్గం.
ప్రతి యూనిట్ విద్యుత్ కి జగన్ కి రూపాయి కప్పం కడుతున్నాయి విద్యుత్ కంపెనీలు
8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్ అవినీతే కారణం
డైనమిక్ ప్రైసింగ్ అంటూ జగన్ ప్రజల్ని దోపిడి చేస్తుంది. టిడిపి గెలిచిన వెంటనే పాత స్లాబ్ విధానాన్ని తీసుకొస్తాం.
జగన్ 12 లక్షల కోట్లు అప్పు చేసి పోతాడు. అప్పులకి వడ్డీ కట్టడమే కష్టంగా మారే పరిస్థితి ఉంటుంది.
జగన్ కట్ చేసిన 6 లక్షల పెన్షన్లు తిరిగి ఇస్తాం.