ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం గ్రానైట్ రంగం ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి. టిడిపి హయాంలో రూ.4 ఉన్న యూనిట్ విద్యుత్ ధర జగన్ పాలనలో రూ.7 కి పెరిగిపోయింది. జగన్ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అని మమ్మల్ని మోసం చేసాడు. 4 లక్షల మందికి ఉపాధి గా ఉన్న చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమను జగన్ నాశనం చేశాడు. జగన్ పాలనలో 800 ఫ్యాక్టరీల్లో సగం మూతపడ్డాయి. గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నాం. కృష్ణపట్నం పోర్టు అదానీ కి ఇచ్చి ఇతర కంపెనీల కంటైనర్లు రాకుండా చెయ్యడం వలన ఎక్స్ పోర్ట్ పై ఒక్కో కంపెనీ కి రూ.60 వేలు అదనంగా ఖర్చు అవుతుంది. రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు వంద శాతం పెంచి మా పొట్ట కొట్టాడు. మైనింగ్ యాజమానుల పై విపరీతమైన ఫైన్లు వేసి వేధిస్తున్నారు. గ్రానైట్ ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని జగన్ దెబ్బతీసాడు. ఓవర్ లోడ్ పేరుతో వేధిస్తున్నారు. ఫైన్లు విపరీతంగా పెంచేశారు. రూ.2 వేలు ఉన్న ఓనర్ పెనాల్టీ ని జగన్ రూ.20 వేలు చేసాడు. టన్ను పై వెయ్యి ఉన్న పెనాల్టీ జగన్ రెండు వేలు చేసాడు. 400 లారీలు గతంలో తిరిగేవి ఇప్పుడు కేవలం 40 లారీలు తిరిగే పరిస్థితి వచ్చింది.
… గ్రానైట్ రంగం ప్రతినిధులు
నారా లోకేష్ మాట్లాడుతూ
దోపిడీదార్లు, పేదలకి మధ్య యుద్ధం జరుగుతుంది. దోపిడీదారు జగన్ పాలనలో అన్ని రంగాల ప్రజలు బాధితులే. మైనింగ్ రంగం పై ఆధారపడిన వారు కూడా జగన్ బాధితులే. జగన్ పాలన లో జనం భయంతో బ్రతుకుతున్నారు. గ్రానైట్ పరిశ్రమ పై రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. అలాంటి రంగాన్ని జగన్ దెబ్బకొట్టాడు. గ్రానైట్ పరిశ్రమ పై ఆధారపడిన వారి పొట్ట కొట్టాడు జగన్. జగన్ మైనింగ్ కంపెనీ కోసం రాష్ట్రంలో ఉన్న ఇతర అన్ని మైనింగ్ యజమానులను వేధిస్తున్నారు. గ్రానైట్ ని ఇండస్ట్రీ గా గుర్తించి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చింది టిడిపి. టిడిపి ప్రభుత్వం లో ఎప్పుడూ గ్రానైట్ పరిశ్రమను వేధించలేదు. జగన్ గ్రానైట్ పరిశ్రమను మోసం చేసి సంక్షోభంలోకి నెట్టేసాడు. రాష్ట్రంలో జగన్ మైనింగ్ కంపెనీ తప్ప వేరే కంపెనీ ఉండకూడదు అనే ఉద్దేశంతో అందరినీ వేధిస్తున్నాడు. జీఓ. 42 తెచ్చి రాయల్టీ ని వంద శాతం పెంచాడు. జీఓ.65 తెచ్చి డెడ్ రెంట్ ని 10 రెట్లు పెంచేసాడు. సెక్యూరిటీ డిపాజిట్ 3 రెట్లు పెంచాడు. జీఓ.90 తీసుకొచ్చి మైనింగ్ కంపల్సరీ పేరుతో ముందే పన్నులు వసూలు చేస్తున్నాడు. జీఓ.13 తెచ్చి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఫీజు భారీగా పెంచేశాడు. జీఓ.63 తెచ్చి ప్రైవేట్ వ్యక్తులకు రాయల్టీ వసూలు చేసే హక్కు కల్పిస్తున్నాడు.
జగన్ చీమకుర్తి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అని హామీ ఇచ్చి మాట తప్పాడు. జగన్ మైనింగ్ రంగాన్ని దెబ్బతీసే విధంగా రాయల్టీ, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన గ్రానైట్ పాలసీ తీసుకొస్తాం. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న మంచి పాలసీలు అధ్యయనం చేసి మెరుగైన పాలసీ అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. గతంలో ఇచ్చిన రేటు కే మీకు విద్యుత్ అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనింగ్ రంగం పై జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. మైనింగ్ పరిశ్రమ ను ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా. మీ నుండి కోరేది ఒక్కటే ఎక్కువ మంది యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
జగన్ మైనింగ్ పరిశ్రమను దెబ్బతీస్తూ తీసుకొచ్చిన అన్ని జీఓ లు రద్దు చేస్తాం. జగన్ హయాంలో మైనింగ్ యజమానులు పై పెట్టిన అక్రమ కేసులు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తేస్తాం. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ని జగన్ కోలుకోలేని దెబ్బ తీసాడు. ఓవర్ లోడ్ పెనాల్టీ, గ్రీన్ ట్యాక్స్, సర్వీస్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు తగ్గించి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని కాపాడతాం. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ పన్నుల దెబ్బకి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1 గా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తాం. ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి మీ పై భారం పడకుండా అన్ని కంపెనీల కంటైనర్లు అందుబాటులోకి తీసుకొస్తాం.