సర్వశిక్షా అభియాన్ రిసోర్స్ పర్సన్ గా ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది. అన్ని పనులు మాతో పని చేయిస్తున్నారు. జీఓ.65 తీసుకొచ్చి మాకు ఉద్యోగ భద్రత లేకుండా జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు.
ప్రొఫెషనల్స్ వింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది. రాజకియల్లో ప్రొఫెషనల్స్ ని ఎలా భాగస్వామ్యం చేస్తారు?
రాష్ట్రం వదిలి పెట్టి వెళ్లిపోయిన కంపెనీలు తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడక సర్టిఫికెట్లు రావడం లేదు. దాని వలన ఉద్యోగాలు రావడం లేదు.
విదేశీ విద్య పథకం రద్దు చేయడం వలన ఎంతో మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే మళ్లీ పథకాన్ని ప్రారంభిస్తారా?
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్ ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ చెయ్యకపోవడం తో వర్క్ ఫ్రమ్ హోం కి అవకాశం లేకుండా పోయింది.
ప్రైవేట్ స్కూళ్ల లో పనిచేస్తున్న టీచర్లను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అని జగన్ మోసం చేసాడు.
కోవిడ్ టైం లో పనిచేసిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు కల్పిస్తాం అని ఇచ్చిన హామీ కూడా జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారిని వెనక్కి తీసుకురావడానికి ఎం చేస్తారు.
టాక్స్ కట్టే వారినే ప్రభుత్వం వేధిస్తుంది.
అడ్వకేట్లు అనేక ఇబ్బందులు పడుతున్నాం. న్యాయవాదులకు రక్షణ లేదు.
…వివిధ రంగాల ప్రొఫెషనల్స్
లోకేష్ మాట్లాడుతూ
రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. కట్టుబట్టలతో మెడ పట్టి బయటకి గెంటేశారు.
ఆ రోజు ప్రజలు అంతా చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మారు.
అందరినీ ఒప్పించి అమరావతి ని రాజధాని గా ప్రకటించారు. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించారు.
రాయలసీమ ని ఎలెక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్ గా తయారు చేశాం.
విశాఖ కి ఐటి హబ్ గా తయారు చేశాం.
టిడిపి హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించింది.
ఐటి మంత్రిని చూస్తుంటే కోడి గుడ్డు గుర్తువచ్చే పరిస్థితి జగన్ పాలన లో వచ్చింది.
జగన్ ఐఈడి డిసార్డర్ ఉంది. ఎక్స్ ప్లోజీవ్ డిసార్డర్ ఉంది. ఈ జబ్బు లక్షణం విధ్వంసం. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన ప్రారంభం అయ్యింది.
అమర్ రాజా, రిలయన్స్, లులూ లాంటి కంపెనీలను తరిమేశాడు.
నెలుగెళ్ళ 3 నెలల్లో ఒక్క మంచి కంపెనీ అయినా వచ్చిందా?
బాబు గారి పాలనలో కియా, ఫాక్స్ కాన్ వచ్చాయి.
జగన్ పాలన లో ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ లిక్కర్ కంపెనీలు వచ్చాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది.
అన్ని రంగాల నిపుణులు జగన్ బాధితులే. లాయర్లు, డాక్టర్లు, టీచర్లు అందరూ జగన్ బాధితులే.
యకనామిక్ యాక్టివిటీ ని పూర్తిగా ఆపేసాడు జగన్. రాష్ట్రం ఆర్దికంగా చితికిపోయింది.
రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే బాబు గారు రావాలి.
అప్పు చేసి సంక్షేమం చెయ్యడం గొప్ప కాదు…సంపద సృష్టించి సంక్షేమం అందించే సామర్థ్యం ఒక్క బాబు గారికే ఉంది.
జగన్ 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు లాక్కుంటున్నాడు.
ప్రొఫెషనల్స్ ఎంతా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి.
నాడు – నేడు అని హడావిడి చెయ్యడం తప్ప జగన్ పాలనలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోలేదు.
జగన్ విద్యా వ్యవస్థను కూడా విధ్వంసం చేసాడు.
సర్వశిక్షా అభియాన్ లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ కి న్యాయం చేస్తాం. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పాలసీలు రూపొందించడానికి ప్రొఫెషనల్స్ ని భాగస్వామ్యం చేస్తాం. అందుకే ప్రొఫెషనల్స్ వింగ్ ఏర్పాటు చేశాం. వివిధ రంగాల ప్రొఫెషనల్స్ ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తాం. తద్వారా సమాజానికి మెరుగైన సేవ చేసే అవకాశం వస్తుంది.
జగన్ తరిమేసిన కంపెనీలను తిరిగి తీసుకురావడం కష్టం. ఏపిలో ఉన్న కంపెనీలకు ముందు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉంటేనే బయట వాళ్లు వస్తారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది వికేంద్రకరణ లో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతాం.
లూలూ ని జగన్ తరిమెస్తే ఏపిలో తప్ప దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నాం అని లూలూ ప్రకటించింది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపి బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా కొత్త పాలసీలు ప్రకటిస్తాం.