విఆర్ఏలను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డిఏ ను వెనక్కి ఇవ్వాలంటూ రికవరీ పెట్టి వేధిస్తున్నారు. గెలిచిన వెంటనే జీతం 15 వేలు చేస్తానని జగన్ మోసం చేశారు. మా సమస్యల పై పోరాడితే వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదు. ప్రమోషన్ల అంశంలో పాత విధానాన్ని కొనసాగించాలి. జగన్ తీసుకొచ్చిన కొత్త విధానం వలన ఇబ్బందులు పడుతున్నాం. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ వేధింపులు ఆపాలి. 4వ తరగతి ఉద్యోగస్తులు గా గుర్తించాలి. పే స్కేల్ అమలు చెయ్యాలి. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు, భూములను వైసిపి ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. టిడిపి హయాంలో మమ్మలని అన్ని రకాలుగా ఆదుకున్నారు. రీసర్వే చేస్తున్న మాపై అనేక దాడులు జరుగుతున్నాయి. మా రక్షణ కోసం సెక్షన్ 353 అమలు చెయ్యాలి. మిమ్మలని కలవద్దని అనేక ఆంక్షలు పెట్టి వేధించారు. అయినా మా సమస్యలు మీతో చెప్పుకోవడానికి వచ్చాం. వైసిపి గెలిచిన వారంలో జీతాన్ని 15 వేలకు పెంచుతాం అంటూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ వీడియో ని లోకేష్ కి చూపించిన విఆర్ఎలు. లోకేష్ ఎదుట సమస్యలను విన్నవించుకున్నారు.
విఆర్ఏ సమస్యలపై లోకేష్ మాట్లాడుతూ
విఆర్ఏ సమస్యలపై లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధి విఆర్ఏ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 26 వేల మంది పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రూ. 3,500 ఉన్న జీతాన్ని చంద్రబాబు గారు రూ. 10,500 చేశారు. రూ.100 ఉన్న డిఏ ను రూ.300 కి పెంచింది చంద్రబాబు గారు. గతంలో ఇంటి స్థలం, భూమి కూడా కేటాయించాం. కానీ పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. అనుభవం లేని వ్యక్తి నోటికి వచ్చిన హామీలు అన్ని ఇచ్చాడు జగన్. విఆర్ఏ లు కూడా జగన్ బాధితులే. గెలిచిన వారంలో 15 వేల జీతం చేస్తామని మోసం చేశారు జగన్. ఇది కూడా సిపిఎస్ లాంటి మోసమే. వారంలో రద్దు చేస్తానని ఇప్పుడు అవగాహన లేక హామీ ఇచ్చా అన్నాడు జగన్. ప్రభుత్వ ఉద్యోగస్తులను వైసిపి ప్రభుత్వం,నాయకులు కించపరుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు దొచేస్తున్నారు కాబట్టి మీకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందిస్తున్నాం అంటూ జగన్ ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. విఆర్ఏ లను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. విఆర్ఏ లకు 10,500 జీతం చేసిన చంద్రబాబు గారికి తోలు మందం అంటూ జగన్ విమర్శ చేశాడు. మరి విఆర్ఏ ల నుండి డిఏ రికవరీ పెట్టిన జగన్ కి ఎంత తోలు మందమో అర్దం చేసుకోండి.
ఫేషియల్ రికగ్నిషన్ అంటూ విఆర్ఏ లను వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు లేవు. జగన్ ప్రభుత్వం డిఏ కు విఆర్ఏ అర్హులు కారంటూ డబ్బు రికవరీ చేస్తున్నారు. ఒక్కో విఆర్ఏ నుండి రూ.19,200 రికవరీ చేసి వేధిస్తుంది వైసిపి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు, ఒక్క కర్నూలు జిల్లా లోనే కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు రికవరీ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ వేధింపులు లేకుండా చేస్తాం. మీ రక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు కల్పిస్తాం. ప్రమోషన్లకి పాత విధానాన్ని కొనసాగిస్తాం. పే స్కేల్, 4వ తరగతి ఉద్యోగస్తులు గా గుర్తించడం తదితర సమస్యలు అన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మీకు న్యాయం చేస్తాం. గౌరవ వేతనం ఖచ్చితంగా పెంచుతాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ఉద్యోగస్తులను వేధించాలి అనే ఆలోచన మాకు లేదు.