జగన్ పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు, పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రంలో ఐటి కంపెనీలు లేక ఇతర రాష్ట్రాలు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నాం. జగన్ పాలనలో విదేశీ విద్య పథకం రద్దు చేశారు. ఏపిలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరిగిపోయింది. ఆత్మకూరు నియజకవర్గంకి వచ్చిన సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమను జగన్ వేరే చోటకి తరలించారు. జగన్ పాలనలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఆత్మకూరు లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి. జగన్ పాలనలో స్కిల్ డెవలప్మెంట్ ని నిర్వీర్యం చేసారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. సోమశిల ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎప్పటిలోగా నిరుద్యోగ భృతి కల్పిస్తారు? జగన్ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పథకాన్ని నిర్వీర్యం చేశారు.
…..ఆత్మకూరు యువత
లోకేష్ మాట్లాడుతూ
యువత కోసం యువగళం మొదలుపెట్టాను. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది టిడిపి పరిపాలన ఒకే చోట… అభివృద్ది వికేంద్రీకరణ మా నినాదం చంద్రబాబు గారి పాలనలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉంది. జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిపోయింది. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబే గంజాయి డాన్. ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తుంది వైసిపి నాయకులే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి పై యుద్ధం ప్రకటిస్తాం. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి డిఎడిక్షన్ సెంటర్లు జగన్ మూసేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తెరిచి గంజాయి కి బానిసలు అయిన వారిని దానినుండి బయటకు తీసుకొస్తాం. సే నో టూ గంజాయి. గంజాయి వద్దు బ్రో.
రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దాం. విశాఖ కి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. ఒక్కో జిల్లా ని ఒక్కో రంగంలో అభివృద్ది చెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేశాం. టిడిపి హయాంలో 8.32 లక్షల ఉద్యోగాలు కల్పించాం. టిడిపి హయాంలో డిఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. జగన్ యువత ను చీట్ చేశాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసాడు. మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తానని మోసం చేశాడు జగన్.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ప్రతి ఏడాది 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని జగన్ మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని వైసిపి ప్రభుత్వం మండలి సాక్షి గా ప్రకటించింది. స్వయం ఉపాధి లో మరో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం. డిఎస్సీ ద్వారా 32 వేలు అన్ని కలిపి 8.32 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చాం. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చెయ్యాల్సిన దుస్థితి మనకెందుకు? ఐదేళ్లు మాకు ఇవ్వండి ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి ఉద్యోగాల కోసం వచ్చేలా చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో ఐటి ఉద్యోగాలు కల్పించే విధంగా రూరల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తక్కువ ఖర్చుతో కంపెనీలు రూరల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందిస్తాం. తద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయి. నియోజకవర్గ స్థాయిలో ఐటి ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో పని చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ రద్దు చేసిన పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తిరిగి అమలు చేస్తాం.
పోలీసు శాఖ కి నిధులు పెంచాలి. పోలీసు శాఖని బలోపేతం చేస్తాం. పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం. యూపిపిఎస్సీసి తరహాలో ఏపిపిఎస్సీ ని పటిష్ఠ పరుస్తాం. రాజకీయ జోక్యం లేకుండా చేస్తాం. రాజకీయ పునరావాస కేంద్రం లా కాకుండా అవసరమైతే చట్టం మారుస్తాం. జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో చెయ్యలేదు. రాజకీయాల కోసం జిల్లాలు విభజించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా జిల్లాల విభజన చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన తప్పులు సరి చేస్తాం.
జిల్లాలకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర కాలేజీలు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ టూ పీజీ సబ్జెక్ట్ మొత్తం ప్రక్షాళన చేస్తాం. జాబ్ రెడీ యూత్ ని సిద్దం చేస్తాం. డిఎస్సీ నిర్వహించి పెండింగ్ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తాం. జగన్ కి స్కిల్ డెవలప్మెంట్ ఏ శాఖ కిందకి వస్తుందో కూడా తెలియదు. అక్కడ పని చేసే వారిపై ఒత్తిడి చేసి నాపై కేసు పెట్టాలని చూసారు. నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఏమి పికలేకపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ పటిష్ఠంగా అమలు చేస్తాం. కాలేజీ – కంపెనీ కనెక్ట్ తీసుకొస్తాం. కెరియర్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కెరియర్ కౌన్సిలర్స్ ని ఏర్పాటు చేస్తాం.
ఏ రంగంలోకి వెళ్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కెరియర్ కౌన్సిలర్స ద్వారా గైడెన్స్ ఇప్పిస్తాం..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి టిడిపి హయాంలో భద్రత ఉండేది. క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చే వాళ్ళం. జీతాలు పెంచాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జీతాలు ఇవ్వకుండా వేధిస్తుంది. సోమశిల ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాక్ లాగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందజేస్తాం. అన్ని కులాల కార్పొరేషన్లు బలోపేతం చేస్తాం. స్వయం ఉపాధికి సాయం అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ యువత ను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తాం.
జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు. సిఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో దళితుడు జంద్యాల కృష్ణయ్య ను కొట్టి చంపేశారు. పులివెందుల లో నాగమ్మ అనే దళిత మహిళ ను అత్యాచారం చేసి చంపేశారు. టిడిపి దళిత నాయకులు పోరాడితే వారి పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన దుర్మార్గపు పాలన జగన్ ది. ఇప్పుడు నాగమ్మ కుటుంబాన్ని మాయం చేశారు . విజనరీ కి ప్రిజనరి కి యువత తేడా తెలుసుకోవాలి విజనరీ చంద్రబాబు గారి పాలనలో కియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టివి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విజనరీ పాలనలో గంజాయి, జే బ్రాండ్ లిక్కర్, ఇసుక మాఫియా. విజనరీ పాలనలో హెచ్సిఎల్, కాండ్యుయెంట్, కియా, టిసిఎల్, డిక్షన్ లాంటి కంపెనీలు వచ్చాయి.
ప్రిజనరి పాలనలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. ఫాక్స్ కాన్, రిలయన్స్, అమర్ రాజా లాంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ అందుకే సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంచి పని చెయ్యకుండా ప్రజా వేదిక కూల్చాడు. ఆయన ఇచ్చే పప్పూ, బెల్లం పై ఆయన చెప్పు చేతల్లో ఉండాలి అనుకోవడమే జగన్ ఫ్యాక్షన్ మెంటాలిటీ. కంపెనీలు తీసుకొచ్చి, అందరికి ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రం అభవృద్ధి చెంది అందరూ సొంత కాళ్ళ పై నిలబడాలి అనుకునేది విజనరీ చంద్రబాబు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ గ్రిడ్ ని పటిష్ఠంగా అమలు చేసి అన్ని గ్రామాలకు తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం. తద్వారా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అభివృద్ది చేస్తాం.
ఆనం రామనారాయణ రెడ్డి
50 శాతం కి పైగా ఆత్మకూరు యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి. అందరూ ఊర్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. కేవలం వృద్దులు మాత్రమే ఉంటున్నారు. ఆత్మకూరు లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి అనే కల ఎప్పటి నుండో ఉంది. లోకేష్ రేపటి తరానికి వారధిగా ఉండాలి అని కోరుకుంటున్నాను.