మార్కాపురం మాస్ జాతర అదిరిపోయింది. ఆరోగ్యం సహకరించకపోయినా తగ్గేదేలేదు అంటూ నారాయణ రెడ్డి గారు పాదయాత్ర లో పాల్గొన్నారు. దేశం మొత్తం అక్షరాలు దిద్దింది మార్కాపురం పలకల పైనే. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం, వెలిగొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి మార్కాపురం. ఘన చరిత్ర ఉన్న మార్కాపురం నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. యువగళం జగన్ కి భయం పరిచయం చేసింది. కలలో కూడా జగన్ కి లోకేషే కనపడుతున్నాడు. యువగళం దెబ్బకి జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. వెంకటగిరి సభలో జగన్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ గా మారాడు. అందుకే జగన్ పేరు ఫ్రస్ట్రేటెడ్ బాయ్ అని పెట్టాను. పీకడానికి ఏమి లేక పబ్జి ఆడుకుంటూ యూట్యూబ్ వీడియోలు చూసుకుంటున్నాడు. స్విమ్మింగ్ పూల్ వీడియో చూసాడట.. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చెయ్యకపోతే జాగింగ్ చేస్తామా? 20 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ కి వెళ్ళాను అందులో తప్పేంటి? ఫ్రస్ట్రేటెడ్ బాయ్ జగన్ యూట్యూబ్ లో చూడాల్సిన ఖర్మ నీకెందుకు, నన్ను అడిగితే నేను స్విమ్మింగ్ చేసే వీడియో నీకు వాట్సప్ లో పంపేవాడిని. ఒక క్రిమినల్ క్యారక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని మా బాబు అనలేదు జగన్ మీ బాబు అన్నాడు. సొంత తండ్రే నిన్ను రాష్ట్రంలో అడుగుపెట్టవద్దని అన్నాడు అంటే నీ క్యారక్టర్ ఎంత వరస్టో అర్ధమవుతుంది.
పదో తరగతి పేపర్లు కొట్టేసి జైలుకి వెళ్లాడు జగన్ సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకి గెంటేసే చీప్ క్యారెక్టర్ జగన్ ది. సొంత బాబాయ్ ని లేపిసి గుండెపోటు అని కథ చెప్పే దరిద్రపు క్యారక్టర్ జగన్ ది. సొంత చెల్లి క్యారక్టర్ మంచిది కాదని చెప్పే చెత్త క్యారక్టర్ జగన్ ది. నాకు క్యారక్టర్ ఉంది..క్యాలిబర్ ఉంది. ఏ తప్పు చెయ్యలేదు కాబట్టే జనంలో తలెత్తుకొని తిరుగుతున్నా. నీది చీప్ క్యారెక్టర్ కాబట్టే పరదాలు కట్టుకొని తిరుగుతున్నావ్. మాకు యూట్యూబ్ వీడియోలు అవసరం లేదు జగన్, గూగుల్ టేకవుట్ చాలు. ఎవరు ఎవరికి కాల్ చేసారు. ఎంత టైం మాట్లాడుకున్నారు. అన్ని సార్లు కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారో తెలిస్తే నీకు గుండెపోటు వస్తుంది. జగన్ నాది కాలేజ్ లైఫ్… నీది జైల్ లైఫ్. నాకు క్లాస్ మేట్స్ ఉన్నారు. నీకు జైల్ మేట్స్ ఉన్నారు. పర్సనల్ ఎటాక్ చేస్తానంటే నేను రెడీ.. నువ్వు రెడీనా? జగన్ కి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది. అన్ని ఆత్మలతో మాట్లాడి బాబాయ్ ఆత్మతో మాత్రం మాట్లాడటం లేదు. బాబాయ్ ఆత్మకి కోపం వచ్చింది. అందుకే బాబాయ్ ఆత్మ జగన్ ని వెంటాడుతుంది. సొంత చెల్లి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చింది. ఏంటో తెలుసా? అది జగనాసుర రక్త చరిత్ర అని సొంత చెల్లి చెప్పేసింది. జగన్ ఇప్పుడు అడుగుతున్నా మొహం ఎక్కడ పెట్టుకుంటావ్? రాజకీయ కారణాలతోనే బాబాయ్ ని అబ్బాయిలు లేపేసారని చెల్లి చెప్పేసింది.
కోల్డ్ వార్ కాస్తా బ్లడ్ వార్ గా మారింది అని చెల్లి వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగన్. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు.
మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టుని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. మార్కాపురం రూపురేఖలు మార్చేస్తాడని మీరు నాగార్జున రెడ్డిని గెలిపించారు. మార్కాపురంలో దొంగలు పడ్డారు. ఆ దొంగ గ్యాంగ్ పేరు చోటా నయూమ్ గ్యాంగ్.
చోటా నయూమ్ గ్యాంగ్ కి హెడ్ నాగార్జున రెడ్డి, తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి, మామ ఉడుముల శ్రీనివాస రెడ్డి, బావమరిది ఉడుముల అశోక్ రెడ్డి, పాండురంగా రెడ్డి చోటా నయూమ్ గ్యాంగ్ సభ్యులు. ఈ చోటా నయూమ్ గ్యాంగ్ రాష్ట్రంలోనే అతి పెద్ద భూకుంభకోణానికి పాల్పడింది. మార్కాపురం మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్న రాయవరం, ఇడుపూరు, గోగులదిన్నె, గుబ్బూరు గ్రామాల్లో 378 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసారు. ఒక్కో ఎకరం విలువ ఎంతో తెలుసా?మొత్తం స్కాం విలువ రూ.800 కోట్లు. ఈ స్కాం వెనుక క్విడ్ ప్రో కో ఉంది. ఈ స్కాంలో జగన్ కి కూడా వాటా ఉంది. మెడికల్ కాలేజ్ అక్కడే వస్తుందని ముందు ఈ చోటా నయూమ్ గ్యాంగ్ కి ఎలా లీక్ అయ్యింది? కుందూరు సురారెడ్డి, మస్తాన్ వలీ, ఎల్లయ్య ఇలా అనేక మంది బినామీల పేర్లతో 378 ఎకరాలు కొట్టేసారు. ఆ ఆధారాలు నేను ఈ బహిరంగ సభ వేదికగా బయటపెడుతున్నాను. ప్రభుత్వ భూమి వారసత్వంగా వచ్చిన భూమి ఎలా అవుతుంది. రామచంద్రాపురంలో 5 ఎకరాలు, పెద్ద యాచవరం లో 45 ఎకరాలు, రాజుపాలెంలో 6 ఎకరాలు, మార్కాపురం టౌన్ లో 11 ఎకరాలు, చింతకుంటలో 90 ఎకరాలు, భూపతి పల్లె లో 105 ఎకరాలు, గజ్జలకొండలో 19 ఎకరాల భూమిని ఈ చోటా నయూమ్ గ్యాంగ్ కొట్టేసింది. ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు ఈ చోటా నయూమ్ గ్యాంగ్. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన భూమిని కొట్టేసారు.
మార్కాపురం లో ప్రజలు, వ్యాపారస్తులు జిఎస్టీ తో పాటు కేయూటి కూడా కట్టాలి. చోటా నయూమ్ గ్యాంగ్ కేయూటి వసూలు చేస్తుంది. కేయూటి అంటే ఏంటో తెలుసా కుందూరు – ఉడుముల ట్యాక్స్. పొదిలిలో ఒక చర్చి కి సంబంధించిన భూమిని కబ్జా చేసి ఉడుముల ఆసుప్రతిని నిర్మించారు. ఎమ్మెల్యే బావమరిది అశోక్ రెడ్డి, మామ శ్రీనివాసుల రెడ్డి కలెక్ట్ చేసిన కేయూటి తో రూ.50 కోట్లు విలువైన ఉడుముల ఆసుపత్రి నిర్మించారు. చోటా నయూమ్ గ్యాంగ్ డ్రగ్స్ దందా కూడా చేస్తుంది. మార్కాపురం కి డ్రగ్స్ తీసుకువస్తున్న సమయంలో దరిమడుగులో ఎస్ఈబి అధికారులు చోటా నయూమ్ డ్రగ్ గ్యాంగ్ ని పట్టుకున్నారు. ఈ డ్రగ్ దందా బయటపకుండా మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా రంగంలోకి దిగి కేసు లేకుండా చేసారు. మూసి , గుండ్లకమ్మ నదుల నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు ఈ చోటా నయూమ్ గ్యాంగ్. కృష్ణపట్నం పోర్టుకి తరలించి నెలకి కోటి కొట్టేస్తున్నారు. చోటా నయూమ్ గ్యాంగ్ గ్రావెల్ దందా, బెల్టు షాపులతో లిక్కర్ మాఫియా నడుపుతుంది. జగన్ మార్కాపురం కి అనేక హామీలు ఇచ్చాడు. వెలిగొండ పూర్తిచేసి సాగు, తాగు నీరు ఇస్తానని చెప్పాడు. పొదిలి లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని అన్నాడు.
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మార్కాపురం ని అభివృద్ధి చేసింది టిడిపి. నారాయణ రెడ్డి గారు నా వెంట పడి మరీ మార్కాపురం కి నిధులు తీసుకొచ్చారు. రూ.1500 కోట్లతో మార్కాపురాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగు నీటి పథకాలు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పేదలకు ఇళ్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించింది టిడిపి. మార్కాపురంలో టిడిపి చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. అందుకే వివరాలు అన్ని మీడియా కి రిలీజ్ చేస్తాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. పొదిలి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజ్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. మార్కాపురంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పనులు మనం ప్రారంభించాం. జగన్ వచ్చి ఆ పనులు ఆపేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్ పనులు పూర్తిచేస్తాం. టిడిపి హయాంలో 4800 టిడ్కో ఇళ్లు నిర్మించాం. 10 శాతం పనులు పూర్తి చెయ్యలేని చెత్త ప్రభుత్వం ఇది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి టిడ్కో ఇళ్లు అందిస్తాం.
జగన్ దెబ్బకి పలకల తయారీ పరిశ్రమ సంక్షభంలో పడింది. సుమారు 15 వేల మంది ఈ రంగం పై ఆధారపడ్డారు. రాయల్టీ, పన్నులు, కరెంట్ ఛార్జీలు జగన్ విపరీతంగా జగన్ పెంచేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన పలకల తయారీ పరిశ్రమను కాపాడతాం. సబ్సిడీలు అందిస్తాం. మార్కాపురం పలకలను ప్రమోట్ చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురంలో జరిగిన ల్యాండ్ స్కాంల పై ప్రత్యేక సిట్ వేస్తాం. కొట్టేసిన ప్రతి ఎకరా వెనక్కి తీసుకుంటాం. పేదలకు పంచేస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. మార్కాపురం లో ఉన్నా మలేషియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా. కేసులకు భయపడే బ్యాచ్ మనది కాదు. భయం మా బయోడేటా లో లేదు బ్రదర్ జగన్.