యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం డోన్ నియోజకవర్గం, పోతుదొడ్డి, మానుదొడ్డి గ్రామాల మామిడి రైతులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. పోతుదొడ్డి, మానుడొడ్డి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లోనూ మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. మామిడికి ధరల్లేనప్పుడు నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామిడి రైతుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. పంట నష్టపోయిన వారిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో గిట్టుబాటు ధరకు అదనంగా రూ.2లు ఇచ్చి ఆదుకున్నాం. వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి మామిడి రైతుల్ని దగా చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేకపోయినా వైసీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తానని హామీనిచ్చిన జగన్ మర్చిపోయారు. మేము అధికారంలోకి వచ్చాక మామిడి బోర్డు, స్టోరోజ్ గోడౌన్ ఏర్పాటుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అని లోకేష్ హామీ ఇచ్చారు.