అమరావతిలో శ్రీపొట్టిశ్రీరాములు మెమోరియల్ భవనం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆదోని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆంద్రరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ భవనాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటుచేయాలి.
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.వెయ్యికోట్ల నిధులు కేటాయించి, పేద ఆర్యవైశ్యులకు సబ్సిడీ రుణాలు అందించాలి.
ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే, ఎంపి, నామినేటెడ్ పోస్టుల్లో 10శాతం సీట్లు కేటాయించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మంత్రి పదవి కేటాయించింది తెలుగుదేశం పార్టీ.
వైసిపి అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయి.
ఒంగోలులో సుబ్బారావుగుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, పేద ఆర్యవైశ్యులకు సబ్సిడీ రుణాలిస్తాం అని హామీ ఇచ్చారు.