టిడిపి అధికారంలోకి రాగానే పసురపాడు, శ్రీరామ్ నగర్ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నంద్యాల నియోజకర్గం పసురపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పసురపాడు నుంచి మిట్నాల రస్తా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. పసురపాడులో తాగునీటి సమస్య పరిష్కరించాలి. పసురపాడు నుంచి వెళ్లే రస్తాను కొందరు ఆక్రమించారు. ఆక్రమణలు తొలగించి రహదారి ఏర్పాటు చేయాలి. పసురపాడు జిల్లెల రస్తా బిటి రోడ్డు
ఏర్పాటు చేయాలి.
పసురపాడు నుంచి ఆంజనేయస్వామి గుడివరకు సిసి రోడ్డు నిర్మించాలి. ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మించాలి. జిల్లెల నుంచి పసురపాడు కెసి కెనాల్ తూము ఏర్పాటుచేయాలి. శ్రీరామ్ నగర్ లో కెసికెనాల్ రోడ్డు జిల్లెల రస్తా నిర్మించాలి. శ్రీరామ్ నగర్ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున, మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
గ్రామ పంచాయితీలకు చెందిన రూ.8660 కోట్లను దొంగిలించిన దొంగ ప్రభుత్వమిది. టిడిపి హయాంలో గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. గ్రామంలో అవసరమైన సిసి రోడ్లు, రస్తాల నిర్మాణం చేపడతాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.