రాయలసీమ లో అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు
జోన్ ల వారీగా పంటలపై అధ్యయనం చేసి రైతులకు సూచనలు
వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ఏర్పాటు
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రేట్లు తగ్గిస్తాం
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్ర సందర్భంగా లోకేష్ గురువారం నంద్యాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గుండ్రేవుల ప్రాజెక్టు టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లో ఏ జోన్ లో ఎటువంటి పంటలు వెయ్యాలో అధ్యయనం చేసి రైతులకు సహకారం అందిస్తాం.
బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వ్యవసాయంపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఏపిలోనూ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ వర్క్స్ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం అని లోకేష్ రైతులకు హామీ ఇచ్చారు. రాయలసీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారు అని ప్రశంసించారు. టిడిపి హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారు.
జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు.
జగన్ చేతగానితనాన్ని వాతావరణం పై తోసేసి రైతులకు అన్యాయం చేసారు అని లోకేష్ ఆరోపించారు. టిడిపి హయాంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది.
సేంద్రియ వ్యవసాయం కోసం టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను వైసిపి నాశనం చేసింది.
పెట్టుబడి తగ్గించాలి అనే ఉద్దేశంతోనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫ్ఫార్మింగ్ ని ప్రోత్సహించాం.
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గించి వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అని వివరించారు. టిడిపి హయాంలో పాడి రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఇప్పుడు జగన్ కనీస సాయం అందించడం లేదన్నారు.
వైసిపి నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు. మంత్రి బుగ్గన నియోజకవర్గం లో రైతు రవికి అన్యాయం జరిగితే కనీసం స్పందించలేదు. బుగ్గన అనుచరులే రైతులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
రవికి టిడిపి అండగా ఉంటుంది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాది. అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
రైతులను వైసిపి ప్రభుత్వం నిత్యం అవమానపరిస్తుంది. ధాన్యం కొనమని అడిగితే ఎర్రిపప్ప అని తిట్టి ఒక మంత్రి రైతులను అవమానించారన్నారు. టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,700 కోట్లు ఖర్చు చేసాం. వైసిపి హయాంలో కనీసం టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా ఖర్చు కూడా చెయ్యలేదు.
కర్నూలు నుండి వలసలు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడిన తరువాత నాకు బాధ కలిగింది.
టిడిపి హయాంలో నీటిని సమర్థవంతంగా వాడుకోవడం కోసం 7 లక్షల పంట కుంటలు కూడా తవ్వాం.
గోదావరి, కృష్ణా , పెన్నా అనుసంధానం ప్రక్రియ ప్రారంబించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తాం అని లోకేష్ వెల్లడించారు. పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు.
టిడిపి హయాంలో 50 వేలు లోపు ఉన్న రుణాలు అన్ని ఒక్క సంతకంతో రద్దు చేసాం. భూసార పరీక్షలు,మైక్రో నూట్రియెంట్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలు,రైతు రథాలు అందించాం.
జగన్ పాలనలో గిట్టుబాటుధర లేదు, రూ.3500 ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. ఆనిధి ఎక్కడికి పోయింది, ఇన్స్యూరెన్స్ లేదు, రైతు రుణాలు ఇవ్వడం లేదు, వ్యవసాయం చెయ్యడానికి పరికరాలు, యంత్రాలు ఇవ్వడం లేదు.
ఎన్నికల ముందు రైతు భరోసా రూ.12,500 ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.25 వేలు మోసం చేశాడు జగన్.
ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం అని హామీ ఇచ్చి మోసం చేశాడు జగన్ అని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. జగన్ ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశాడు అని విమర్శించారు.
టిడిపి హయాంలో హార్టికల్చర్ కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లో ఏ జోన్ లో ఎటువంటి పంటలు వెయ్యాలో అధ్యయనం చేసి రైతులకు సహకారం అందిస్తాం అని లోకేష్ చెప్పారు. జగన్ పాలనలో అన్ని హాలిడేలే. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే లే మిగిలాయన్నారు. టిడిపి హయాంలో నేరుగా ఉపాధి హామీని అనుసంధానం చేసే అవకాశం లేకపోయినా హార్టి కల్చర్, పంట కుంటలు ఇతర అంశాల్లో ఉపాధి హామీ ని అనుసంధానం చేసామని చెప్పారు. ఇప్పుడు జగన్ రాయలసీమ రైతుల మెడకి మీటర్ల పేరుతో ఉరి తాడు వేస్తున్నాడు.
ఇది గ్యాస్
సబ్సిడీ లాంటిదే. మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరిస్తే ఇక మీరు నెల నెలా బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీటర్లు బిగించి రైతుల పేరుతో అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్
అని హెచ్చరించారు. వరి, పత్తి, వేరు శనగ, జొన్న, మిరప, పసుపు, మినుములు వేసే రైతుల కష్టాలు అన్ని నేను తెలుసుకున్నాను.
కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడం తో
పాటు. పంట అమ్ముకోవడం కోసం మార్కెట్ ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పిస్తాం అని లోకేష్ రైతులకు హామీ ఇచ్చారు.