టిడిపి అధికారంలోకి వచ్చాక బొందిలి కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం
నంద్యాల సాయిబాబా గుడి వద్ద బొందిలి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బొందిలి కులాన్ని బిసి-బి జాబితా నుంచి ఒబిసి కేటగిరిలోకి మార్చాలి.
బొందిలి కులస్తులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి.
ప్రస్తుత ప్రభుత్వం బొందిలి కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కానీ ఒక్కరికీ కూడా ఆర్థికసాయం అందించలేదు.
బొందిలి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.
నంద్యాల చుట్టుపక్కల దేవస్థానాలైన శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాల్లో బొందిలి రాజ్ పుట్ ల నిత్యాన్నదాన సత్రాలకు నిధులు కేటాయించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి దారుణంగా మోసగించారు.
అవకాశాన్ని బట్టి పుణ్యక్షేత్రాల్లో సత్రాల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తాం.
బొందిలి సామాజికవర్గీయుల్లో ఇళ్లులేని వారికి ఇళ్లు మంజూరు చేస్తాం.
బొందిలి కులస్తులను ఒబిసి జాబితాలో చేర్చే అంశంపై గత నివేదికలను పరిశీలించి న్యాయం చేస్తాం అని వారికి లోకేష్ హామీ ఇచ్చారు.