టిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్రలో సందర్భంగా మంగళవారం కోడుమూరు నియోజకవర్గం వెంకయ్యపల్లి దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీలోన్లు నిలిపేశారు.
సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది.
గతంలో ఎన్ఎస్ఎఫ్ డిసి పథకం కింద దళితులకు వాహనాలు ఇచ్చేవారు. ఇప్పుడు నిలిపివేశారు. బ్యాంకు లింకేజీ లోన్లు నిలిపేశారు.
చిరు వ్యాపారులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలేదు.
రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వడంలేదు, బోర్లు వేయడం లేదు.
మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి. అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీలకు సంక్షేమం, రక్షణ రెండూ కరువయ్యాయి.
గత నాలుగేళ్లలో రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన దళితద్రోహి జగన్ రెడ్డి.
దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేసిన వారికి వైసీపీ నాయకులు సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తున్నారు.
దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న దుర్మార్గపు పాలన జగన్ ది.
గత టిడిపి ప్రభుత్వం దళితులకోసం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
ఎస్సీలపై తప్పుడుకేసులు పెట్టి వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఎస్సీ రైతులకు గతంలో మాదిరి పూర్తి సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.