టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా పనులు దొరికేలా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం
కర్నూలు గడియారం హాస్పటల్ సెంటర్ లో ఆటో కూలీలతో నారా లోకేష్
మాట్లాదారు. ఈ సందర్భంగా కర్నూలు శివారు ప్రాంతాలు అయిన గిందిపర్ల, తాండ్రపాడు, దొడ్డిపాడు, సుందరయ్య నగర్ కి చెందిన కూలీలు నారా లోకేష్ తో వారి సమస్యలు విన్నవించారు. ప్రతి రోజు భవన నిర్మాణ పనుల కోసం 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్నూలు కి వస్తున్నాం.
ప్రతి రోజూ రూ.100 ఖర్చు వస్తుంది. వారంలో 3 రోజులు పని దొరకడమే కష్టం గా మారింది.
పని దొరికితే రూ.600 కూలీ వస్తుంది లేక పోతే మధ్యాహ్నం 12 వరకూ చూసి తెచ్చుకున్న భోజనం ఇక్కడే చేసి ఇంటికి వెళ్ళిపోతాం అంటూ తాము పడుతున్న బాధలు లోకేష్ కి చెప్పుకున్న కూలీలు.
స్థానికంగా పనులు లేక ఇంత దూరం రావాల్సి వస్తుంది. పిల్లల్ని ఇళ్లలో వదిలి పనులకు వస్తున్నాం అంటూ బాధపడిన కూలీలు. తాము తెచ్చుకున్న భోజనం బాక్సులు కూలీలు లోకేష్ కి చూపించారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ఆయా గ్రామాలకు అవసరమైన బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని వారికి లోకేష్ హామీ ఇచ్చారు.