టిడిపి అధికారంలోకి రాగానే మోటార్ల ద్వారా హంద్రీనీవా నుండి వేముగోడుకు మంచినీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర
సందర్భంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం వేముగోడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు.
మా గ్రామం పక్కనే హంద్రీనీవా నది ఉన్నా మా గ్రామంలో మంచినీటి కొరత ఉంది.
టీడీపీ పాలనలో నదిలో రెండు బోర్ మోటార్లతో నీటిని తోడి నీరు సరఫరా చేసేవారు.
వైసీపీ పాలనలో ఒక్క మోటార్ తోనే నీటిని ఇస్తుండటంతో సరిపోవడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చాక మూడు బోర్లు, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలి.
మా గ్రామం నుండి చిన్నాటూర్ గ్రామం మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మించాలి.
గ్రామంలో కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు లేవు. రోడ్ల నిర్మాణం చేపట్టాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లు అందించలేకపోతున్నారు.
మంత్రుల నియోజకవర్గాల్లో కూడా 10రోజులకు ఒకసారి మంచినీరు వచ్చే పరిస్థితులున్నాయి.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు.
టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్లు సీసీరోడ్లు నిర్మించాం.
ఇంటర్నల్ రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణం చేపడతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.