టిడిపి అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల జామియా మసీదు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించి, వాటి ఆదాయాన్ని మైనారిటీ విద్యాసంస్థల అభివృద్ధి, వసతి గృహాలు, స్కాలర్ షిప్ లు వంటి కార్యక్రమాలకు వినియోగించాలి.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి, ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటుచేయాలి.
40శాతం సబ్సిడీపై వృత్తిపనివారలకు, విద్యావంతులకు స్వయం ఉపాధి పథకాలు అందించాలి.
ఖబరస్థాన్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
నంద్యాల జామియా మసీదు అభివృద్ధికి టిడిపి హయాంలో రూ.54లక్షలు కేటాయించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదు. ఇది నంద్యాల జిల్లాలోనే పెద్ద మసీదు.
టిడిపి అధికారంలోకి వచ్చాక మా మసీదుకు రూ.కోటి కేటాయించండి.
విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీచేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ ప్రభుత్వంలో మైనారిటీల ధన, మాన, ప్రాణాలకు రక్షణలేదు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి.
తమ ఆస్తుల కబ్జాను అడ్డుకున్నందుకు నర్సరావుపేటలో వైసిపినేతలు ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.
గత ప్రభుత్వంలో మైనారిటీ కోసం అమలుచేసిన రంజాన్ తోఫా, దుల్హాన్ వంటి పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం.
ఖబర్ స్థాన్ ల అభివృద్ధికి నిధులుకేటాయించి, రక్షణకు ప్రహరిగోడలు నిర్మిస్తాం.
నంద్యాల జామియా మసీదు అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.