టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయితీల పరిధిలో ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో గొర్రెల మేపుకు హక్కు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం కడిమెట్ల శివార్లలో యువనేత లోకేష్ గొర్రెల కాపర్లను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రామలింగప్ప, వీరన్న, రామకృష్ణ, హనుమంతు మాట్లాడుతూ గొర్రెలు మేపుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లినపుడు చాలా గొర్రెలు చనిపోతున్నాయి. ఈ ప్రభుత్వంలో బీమా సౌకర్యం లేదు.
గొర్రెలకు రోగాలు వచ్చి తక్కువరేటుకు అమ్మాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి మందులు ఇవ్వడంలేదు.
కడిమెట్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఉంటే వాటిని వైసిపి నేతలు కబ్జా చేశారు.
పొలాల్లోకి వెళ్తుంటే రైతులు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రభుత్వ బంజరు భూములు కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. కులవృత్తిగా గొర్రెలు కాసుకుంటున్న కాపర్లపై వైసిపి ప్రభుత్వం
నిర్దయగా వ్యవహరిస్తోంది.
22 గొర్రెలు ఒక యూనిట్ గా 75శాతం సబ్సిడీపై అందజేస్తాం.
ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు రూ.10లక్షల బీమా ఇస్తాం.
గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం, మందులు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.