టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం
కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
కర్నూలు, అదోని రోడ్డులో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ రోడ్డును విస్తరించాలి.
రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేయాలి.
రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటుచేసి మురుగు సమస్యను నివారించాలి.
పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.
స్థానిక సంస్థలకు చెందిన రూ.8,660 కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించింది.
మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేవు.
కోడుమూలో స్థానికులకు ఇబ్బంది లేకుండా రోడ్ల విస్తరణ, డివైడర్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.