టీడీపీ వచ్చాక యేటా సాగునీటి కాల్వల మరమ్మతులతో పాటు, గుర్రపుడెక్కలు, గడ్డి, నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను ఇరిగేషన్ శాఖ ద్వారా తొలగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గం తుమ్ములూరు గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేసీ కెనాల్102 తూము దగ్గరి నుండి పోతిరెడ్డిపాడు వరకు 5 కి.మీ పంట కాలువకు సైడు కాలువ నిర్మాణం చేపట్టాలి.
రైతులకు ఏటా కాల్వలో గడ్డి తీయడానికి రూ.1.5 లక్షలు ఖర్చు అవుతోంది. రైతులే సొంత ఖర్చుతో పనులు చేసుకుంటున్నారు.
గడ్డి తొలగించుకుంటేనే కాల్వల ద్వారా నీరు అందుతుంది..లేదంటే అందని పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం రాగానే మా సమస్యలను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రైతులకు సాగునీరు అందించడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు.
తుమ్ములూరు గ్రామస్తులు కోరిన పోతిరెడ్డిపాడు కాలువ వద్ద సైడు కాలువ నిర్మించే అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలించి, రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంటాం.
ఈ ప్రభుత్వం వచ్చాక కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్కలు, గడ్డి లాంటివి తొలగింపు చర్యలు చేపట్టడం లేదు. దీంతో శివారు ప్రాంతాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
చేతికొస్తున్న పంటను కాపాడుకోవడానికి నీటి పారుదల కోసం రైతులే కాల్వలు శుభ్రం చేసుకోవాల్సి రావడం దారుణం అని లోకేష్ పేర్కొన్నారు.