టిడిపి అధికారంలోకి రాగానే కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. తాము జగన్ లా మాట తప్పి,
మడమ తిప్పమని చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలు జిల్లా కోర్టు భవనం ముందు జిల్లా న్యాయవాదులు లోకేష్ ను కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు లోకేష్ తో మాట్లాడుతూ
కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారు.
హై కోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారు.
అమరావతి లోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టులో వైసిపి ప్రభుత్వం తెలిపింది. విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారు.
జగన్ మాయమాటలు విని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.