టిడిపి అధికారంలోకి రాగానే ఇళ్లులేని స్వర్ణకారులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగాబుధవారం నంద్యాల కల్పన సెంటర్ లో స్వర్ణకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
రెడీమేడ్ నగలు రావడంతో ప్రస్తుతం స్వర్ణకారులం పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర పనులకు దినసరి కూలీలుగా వెళ్తున్నాం.
మాలో చాలామందికి తలదాచుకునేందుకు సొంత ఇళ్లు లేవు.
పిల్లలను ఉన్నత చదువులకు పంపడానికి తగిన ఆర్థిక స్థోమత లేదు.
ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందడం లేదు.
మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా స్వర్ణకారులు సాంకేతికంగా అభివద్ధి సాధించాల్సి ఉంది.
టిడిపి అధికారంలోకి వచ్చాక స్వర్ణకారుల నూతన డిజైన్ల కోసం అవసరమైన స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్, అధునాతన పనిముట్లకు రుణాలు అందజేస్తాం.
స్వర్ణకార పిల్లలకు ఉన్నత చదువులకు సాయం అందిస్తాం.
స్వర్ణకారుల షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందజేస్తాం అని వారికి లోకేష్ హామీ ఇచ్చారు.