టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కడప నగరంలో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప ఎన్టీఆర్ సర్కిల్ సర్కిల్ లో కొండయ్యపల్లికి చెందిన ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.6వ డివిజన్ లో కేసీ కెనాల్ పై అక్రమ కట్టడాలను అరికట్టి రోడ్డును విస్తరించాలి. డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది, పరిష్కరించాలి. మా డివిజన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు అన్న క్యాంటీన్ నిర్మించాలి. మా ప్రాంతంలో అర్హులకు పెన్షన్లు రావడం లేదు. మీకు అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. ఓల్డేజ్ హోమ్ నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక వైసిపి నాయకులు అడ్డగోలు కబ్జా పర్వానికి తెరలేపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప నగరంలో బుగ్గవంకను ఆక్రమించి థియేటర్ నిర్మించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లను తొలగించారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. కడపలో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాం. లక్షలాదిమంది పేదల ఆకలితీర్చిన అన్నా
క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.