టిడిపి అధికారంలోకి వచ్చాక ఆర్ డిఎస్ కుడికాల్వ, ఎల్ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర
సందర్భంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల, సి.బెళగల్ మండలాల రైతులు యువనేత నారా లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. మా రెండు మండలాల పరిధిలో ఎల్.ఎల్.సీ కాలువ కింద 5,500ఎకరాల ఆయకట్టు ఉంది.
కర్ణాటక రాష్ట్రంలో ఎల్.ఎల్.సీ కాలువలో జరిగే జలచౌర్యం వల్ల మా పొలాలకు నీరు అందడం లేదు. తీవ్రమైన నీటి కొరత ఏర్పాడుతోంది.
ఎల్.ఎల్.సీ, గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) ఎడమ కాలువ సమాంతరంగా ప్రవహిస్తాయి.
గతంలో జిడిపి కాలువను తవ్వి నీటిని ఎల్.ఎల్.సీ కాలువలోకి వదిలి పంటలను కాపాడుకునేవాళ్లం.
జిడిపి కాలువ కింద సాగుచేసే రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు.
జిడిపి, ఎల్.ఎల్.సీ కాలువల అనుసంధానంపై రైతులు ఎంతోకాలం నుండి పోరాడుతున్నా ఎవరూ స్పందించడం లేదు.
2018లో జిడిపి, ఎల్.ఎల్.సీ కాలువలను అనుసంధానం చేసేందుకు రూ.25లక్షలు మంజూరు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి.
టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ రెండు కాలువలను అనుసంధానం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి అనివారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
సమస్య తలెత్తినపుడు పరిష్కరించడం మాని గొడవలుపెట్టి తమాషా చూడటం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
అధికారంలోకి వచ్చాక ఒక్క తాగు, సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేని జగన్ ప్రభుత్వం రైతుల మధ్య వివాదాలు సృష్టిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని సమస్యలు వైసిపి ప్రభుత్వంలోనే ఎందుకు వస్తున్నాయో అందరూ ఆలోచించాలి.
ఇరువర్గాల రైతులతో మాట్లాడి జిడిపి, ఎల్ఎల్ సి కాల్వలను అనుసంధానించి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.