టిడిపి అధికారంలోకి వచ్చాక పాడైపోయిన రోడ్లను పునర్నిర్మిస్తాం. అవసరమన చోట ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేస్తాం. నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తిచేస్తాం అని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కోడుమూరు నియోజకవర్గం నూతిరెడ్డిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
మా గ్రామంలో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన రోడ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది.
రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వంలో వేసిన వీధిలైట్లు పాడైపోయాయి.
కొత్త లైట్లు వేయడం లేదు.
గ్రామంలోని డ్రైనేజీలు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి.
డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు ఇళ్లల్లోకి వస్తున్నాయి.
మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి. అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక గ్రామీణాభివృద్ధిని గాలికొదిలేశాడు.
టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల వీధి దీపాలు వేశాం.
నేడు పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కు కూడా డబ్బులేని దుస్థితి కల్పించాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.