టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కృష్ణారావుపేటలో మహిళా వ్యవసాయ కూలీలును లోకేష్ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకూ పత్తిచేలో పనిచేస్తున్నాం. రూ.200 కూలీ వస్తుంది.
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధర పెరగడంతో వచ్చే కూలీ బ్రతకడానికి సరిపోవడం లేదు.
ఎక్కువ రోజులు పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నామని వారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ పాలనలో విపరీతంగా పన్నుల భారం పెంచారు.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి.
కరెంట్ ఛార్జీల దగ్గర నుండి చెత్త పన్ను వరకూ బాదుడే బాదుడు.