టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోలు, డీజిల్, నిత్యవసరాల ధరలను తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్ర సందర్భంగాసోమవారం కర్నూలు జమ్మిచెట్టు బజారులో యువనేత లోకేష్ ఓ టీస్టాల్ వద్ద టీతాగి, నిర్వాహకుడితో కొద్దిసేపు ముచ్చటించారు. వ్యాపారం ఎలాఉందని యువనేత వాకబు చేశారు.
టీస్టాల్ నిర్వాహకుడు అబ్దుల్లా మాట్లాడుతూ కరెంటు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి.
కరోనా తర్వాత వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంది.
పన్నులు, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు పెరగడంతో భారంగా జీవితాన్ని లాగాల్సి వస్తోంది. ధరలు తగ్గిస్తే మాలాంటి వారికి వెసలుబాటుగా ఉంటుంది అని లోకేష్ కు చెప్పారు.
దానిపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యుడు బతకడమే కష్టంగా మారింది.
గత నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.2.5లక్షల భారం మోపారు.
10రూపాయల ఇచ్చి వందలాగేస్తూ ప్రజలను జలగలా పీడిస్తున్నారు.
రాష్ట్రంలో అడ్డగోలుగా పెంచిన పన్నుల విధానాన్ని సమీక్షించి ప్రజలపై భారాన్ని తగ్గిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చా