టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ప్రొద్దుటూరునియోజకవర్గం నంగునూరు పల్లె ప్రజలు లోకేష్ ను కలసి సంస్యల గురించి విన్నవించారు. మా గ్రామ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మాకు ఎలాంటి సదుపాయాలు, రోడ్లు, విద్య,వైద్య సౌకర్యాలు లేవు. వైసీపీ పాలనలో కనీసం మంచినీరు సమస్యలు పరిష్కరించే పరిస్థితుల్లేవు. అధికారులు, పాలకులకు మేం ఇచ్చిన వినతులు చెత్తబుట్ట దాఖలయ్యాయి. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతూ, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు చెందిన రూ.8,600కోట్లను జగన్ దారిమళ్లించి అభివృద్ధిని దెబ్బతీశారు. సొంత డబ్బులతో పనులు చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాచమల్లు లాంటి వారిని ఊరికొక సామంతరాజును ఏర్పాటుచేసుకొని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. వైసిపి నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపి, ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులను
ఉపసంహరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.