మహిళల గొప్పతనం తెలిసేలా పాట్యాంశాలు
ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి.
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ హామీ ఏమయింది?
నిత్యవసర ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం
మహిళలతో నారా లోకేష్ ముఖాముఖి
టిడిపి అధికారంలోకి రాగానే మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహిస్తాం. సబ్సిడీ రుణాలు అందజేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సహకరిస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. మహిళల రక్షణ కు చట్టాలు మాత్రమే కాదు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుండే నేర్పిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల గొప్పతనం, వారి కష్టం అందరికీ తెలిసేలా కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం పాణ్యం నియోజకవర్గం
బోల్లవరంలో మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పలువురు మహిళలు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా అవమానపరుస్తున్నారు. అందుకే మహిళలపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
మా అమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు.
లోకేష్ కి చీర, గాజులు పంపుతాం అని మహిళల్ని అవమానించే విధంగా మంత్రి రోజా మాట్లాడారు అని లోకేష్ చెప్పారు. ఫ్యాన్ ఆరోగ్యానికి హానికరం. ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి.
దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారన్నారు.
విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఫెయిల్ అయ్యాయి.
టిడిపి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించాం.
జగన్ పాలనలో ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తాం అని చెప్పి చెల్లించడం లేదు.
జగన్ విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు బకాయి పడ్డ ఫీజులు అన్ని సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం అని వెల్లడించారు. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని మోసం చేశాడు. మద్యపాన నిషేదం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు.
మందుపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడు.
జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు.
జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదం. డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు జగన్.
ఆ మద్యం తాగితే పైకి పోవడం ఖాయమన్నారు. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాం అని జగన్ మోసం చేసాడు.
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఊసే లేదు అని విమర్శించారు.
జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ఒక కారణం పెట్రోల్, డీజిల్ ధరలు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపి లో ఉన్నాయి.
జగన్ బాదుడే బాదుడుకి ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేసారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం అని నారా లోకేష్ హామీ ఇచ్చారు. డ్వాక్రా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని మోసం చేశారు. ఆఖరికి మీరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసింది అని విమర్శించారు. మంగళగిరి లో మహిళలకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చాం. అక్కడితో ఆగకుండా ఒక మార్కెట్ లింకేజ్ చేసాం అని లోకేష్ వివరించారు.