టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన తాండాలను పంచాయితీలుగా ఏర్పాటుచేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.యువగళం పాదయాత్ర సందర్భంగా శనివారం బనగానపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఆలిండియా బంజార సేవాసంఘ్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చి మాకు అన్యాయం చేయొద్దు.
గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి.
బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ పథకాన్ని వైసీపీ రద్దు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభించాలి.500 జనాభా కలిగిన తాండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలి.
గిరి కళ్యాణ పుత్రిక పథకాన్ని నిబంధనలు లేకుండా అమలు చేయాలి.
టీటీడీ పాలక మండలిలో గిరిజనులకు అవకాశం ఇవ్వాలి.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలి.
జనాభా దామాషా ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ ను 6 నుండి 12శాతానికి పెంచాలి.
శ్రీశైలం దేవస్థానంలో గిరిజన సత్రం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో గిరిజన తాండాలను వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
వైద్యసదుపాయాలు అందక వేలాది గిరిజనబిడ్డలు పొత్తిళ్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
గిరిజనల కోసం ఖర్చుచేయాల్సిన రూ.5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది.
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం జరిపించేలా చర్యలు తీసుకుంటాం.
గిరిజన కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, స్వయం ఉపాధికి చేయూతనిస్తాం.
గిరిజనుల విద్యాభివృద్ధికి ఉపకరించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య పథకాలను పునరుద్దరిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.